అల్లు అర్జున్‌ కే నో చెప్పిన శ్రీలీల..ఎందుకంటే!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీ హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అనే చెప్పుకొవచ్చు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే బడా హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇంకో ఏడాది వరకు కూడా ఆమె డేట్స్ దొరకడం చాలా కష్టమని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

అల్లు అర్జున్‌ కే నో చెప్పిన శ్రీలీల..ఎందుకంటే!
New Update

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీ హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అనే చెప్పుకొవచ్చు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే బడా హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇంకో ఏడాది వరకు కూడా ఆమె డేట్స్ దొరకడం చాలా కష్టమని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

sreeleela rejects special song in pushpa 2

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి మొదలుకుని.. మహేశ్ బాబు, బాలకృష్ణ, రామ్, నితిన్ వంటి యంగ్ హీరోలతోనూ నటిస్తోంది. తాజాగా కొద్ది రోజుల నుంచి శ్రీలీల గురించి ఓ రుమార్‌ నెట్టింట షికారు చేస్తుంది. అది ఏంటంటే..అల్లుఅర్జున్‌ పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ సినిమాలో ఊ అంటావా మామా.. ఊఊ అంటావా మావా సాంగ్‌ కూడా అంతే పాపులర్ అయ్యింది. ఇప్పుడు పుష్ప 2 లో కూడా ఓ ఐటెమ్‌ సాంగ్‌ ని ప్లాన్ చేశాడు మన సుక్కు. దానికోసం శ్రీలీల ను సెలెక్ట్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ..దానికి శ్రీలీల ఒప్పుకోలేదని తాజా సమాచారం. సోలో హీరోయిన్​గా ఫుల్ బిజీగా ఉంటున్న ఈ భామ.. స్పెషల్​ సాంగ్స్​ చేయాలనుకోవడం లేదట.

ప్రస్తుతమున్న హీరోయిన్లలో శ్రీలీల ది బెస్ట్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంటోంది. ఆమె చేతిలో దాదాపు ఏడు సినిమాలు ఉన్నట్టు సమాచారం. కాబట్టి, ఈ పరిస్థితిలో ఆమె భారీ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ అవకాశం ఉంది. కానీ అల్లు అర్జున్ చిత్రానికి నో చెప్పడం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. మాములుగా అయితే బన్నీతో చేసేందుకు చాలా మంది ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ శ్రీలీల మాత్రం ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నట్టు సమాచారం. అయితే మరి పుష్ప 2లో అల్లు అర్జున్‌తో కాలు కదిపే లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో కాలమే చెప్పాలి.

#pushpa2 #reject #alluarjun #sreeleela
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి