O Yeong-Su: లైంగిక వేధింపుల కేసులో స్క్విడ్ గేమ్ నటుడికి జైలు శిక్ష!

స్క్విడ్ గేమ్ నటుడు 79ఏళ్ల O Yeong-Suకు దక్షిణ కొరియా కోర్టు షాక్ ఇచ్చింది. 2017లో ఓ మహిళతో లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడిన కేసులో ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ఓ షూటింగ్ లో ఉన్నప్పుడు యోంగ్ దాడికి పాల్పడ్డట్లు నిర్దారించింది.

O Yeong-Su: లైంగిక వేధింపుల కేసులో స్క్విడ్ గేమ్ నటుడికి జైలు శిక్ష!
New Update

Squid Game actor: స్క్విడ్ గేమ్ నటుడు ఓ యోంగ్-సు.. ఓ మహిళతో లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు దక్షిణ కొరియాలోని కోర్టు ఎనిమిది నెలల సస్పెండ్ జైలు శిక్ష విధించింది. 79 ఏళ్ల యోంగ్ 2022లో ఒక మహిళ తనపై రెండుసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం 2017లో థియేటర్ ప్రదర్శన కోసం ఓ గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగినట్లు నివేదించింది.

ఎనిమిది నెలల సస్పెండ్ జైలు శిక్ష..
అయితే ఈ కేసును గురువారం పరిశీలించిన న్యాయస్థానం.. ఓ యోంగ్ సుకు ఎనిమిది నెలల సస్పెండ్ జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. ఇక ఓ తీర్పుపై పై కోర్టుకు అప్పీల్ చేస్తానని, అందుకు ఏడు రోజుల సమయం ఉందని యోంగ్ చెబుతున్నారు. ఇక సదరు మహిళ అతను కౌగిలించుకుని, ఇష్టానికి వ్యతిరేకంగా చెంపపై ముద్దు పెట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ నటుడు ఖండించారు. 'నేను ఆ మహిళ చేతిని మాత్రమే పట్టుకున్నా. తర్వాత క్షమాపణలు చెప్పాను. దీంతో ఆమె ఎలాంటి ఇష్యూ చేయనని చెప్పింది. అలాగని నేను ఆరోపణలను అంగీకరించినట్లు కాదు' అని యోంగ్ మీడియాతో వివరించాడు.

ఇది కూడా చదవండి: Delhi Liquor Scam: కవిత అరెస్టుకు కారణాలేంటి? అసలు ఈ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఏంటి?

ఇక యోంగ్ నటించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అతను ఓహ్ ఇల్-నామ్ అనే బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న వృద్ధుడి పాత్రలో నటించాడు. అతను పోషించని పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నాడు. డ్రామా సిరీస్ విభాగంలో అత్యుత్తమ సహాయ నటుడిగా ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన యోంగ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

#o-yeong-su #squid-game #eight-month-suspended-prison
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe