World Cup 2023:ఇంత అవమానమా..మరీ ఇంతలా దిగజారాలా-ఏంజెలో మాథ్యూస్
టైమ్డ్ ఔట్....ఇప్పుడు సోషల్ మీడియా, మీడియా ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. ఇంతటి వివాదాస్పద నిర్ణయం మీద శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ మండిపడుతున్నాడు. ఇంత అవమానం ఎప్పుడూ చూడలేదంటూ వాపోయాడు.
టైమ్డ్ ఔట్....ఇప్పుడు సోషల్ మీడియా, మీడియా ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. ఇంతటి వివాదాస్పద నిర్ణయం మీద శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ మండిపడుతున్నాడు. ఇంత అవమానం ఎప్పుడూ చూడలేదంటూ వాపోయాడు.
అంపైర్లతో నిత్యం గొడవలు పడుతూ ఇప్పటికే అనేకసార్లు విమర్శలపాలైన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరోసారి అభిమానుల నుంచి తిట్లు తింటున్నాడు. శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్ 'టైమ్ అవుట్' విషయంలో షకీబ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
గత రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లను టీమిండియా వందలోపే చుట్టేసింది. శ్రీలంకను 55 రన్స్‌కు ఆలౌట్ చేసిన టీమిండియా.. దక్షిణాఫ్రికాను 83 రన్స్‌కే పరిమితం చేసింది. వరల్డ్‌కప్ హిస్టరీలో ఈ ఘనత సాధించిన రెండో టీమ్ ఇండియా.
విరాట్ కోహ్లీ రికార్డుల కోసమే ఆడతాడని, సెంచరీల కోసం స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంటాడని విమర్శలు వినిపించాయి. దీనిపై భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ సీరియస్ గా స్పందించారు. అవును..కోహ్లీ స్వార్థపరుడే అంటూ విమర్శకులకు దీటుగా బదులిచ్చారు.
క్రికెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్. లెజండరీ వీడియోలను ఇక మీదట చూడడం అవ్వదు. ఆ పాత మధురాలన్నింటినీ జాగ్రత్తగా దాచి ఉంచిన రాబ్ లిండా యూట్యూబ్ ఛానెల్ ను టర్మినేట్ చేశారు.
అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి 'టైమ్ అవుట్' అయిన బ్యాటర్‌గా శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు. సమరవిక్రమ అవుటైన తర్వాత మాథ్యూస్ క్రీజులోకి వచ్చినా తన హెల్మెట్ పట్టి ఊడిపోవడంతో దాన్ని రిప్లేస్ చేయడానికి వెయిట్ చేశాడు. ఈలోపు 3నిమిషాలు ముగిశాయి.
ప్రపంచకప్ లో శ్రీలంక అస్సలు సరిగ్గా ఆడటం లేదు. అంతేకాదు భారత్ చేతిలో చాలా ఘోరంగా ఓడిపోయింది కూడా. దీంతో తీవ్ర విమర్శలు పాలయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ ఆ దేశ క్రీడల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలో ఇప్పుడు అందరి నోళ్ళల్లో నానుతున్న పేరు విరాట్ కోహ్లీ. నిన్న సౌతాఫ్రికా మ్యాచ్‌లో సచిన్ సెంచరీల రికార్డ్ ను బద్దలు కొట్టి గొప్ప క్రికెటర్ గా నిలిచాడు. దీని మీద భావోద్వేగంతో స్పందించిన విరాట్...ఏం చేసినా తాను సచిన్ అంత గొప్ప ఆటగాడిని మాత్రం కాదంటున్నాడు.