IND VS AUS: విశాఖలో మ్యాచ్ అంటే ఆ మజానే వేరు.. ఇలాంటి అనుభూతి ఎక్కడా రాదు!
ప్రస్తుతం విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. వైజాగ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ20 ఫైట్ కోసం సాగర నగర తీర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. వైజాగ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ20 ఫైట్ కోసం సాగర నగర తీర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వరల్డ్ కప్ అనంతరం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ ఇవాళ జరుగనుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వైజాగ్ వేదికగా జరుగనుంది. వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది.
మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వినోద్‌పై ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి ఈడీ ఈసీఐఆర్ జారీ చేసింది.
వరల్డ్‌కప్ ఎడిషన్ ముందు వరకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న కోహ్లీ ఇప్పుడు నంబర్-3 పొజిషన్‌కు వచ్చాడు. యువ ఓపెనర్ గిల్ 826పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. కోహ్లీ 791 పాయింట్లతో థర్డ్ ప్లేస్, 769 పాయింట్లతో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నారు.
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా రెడీ అయ్యింది. విశాఖ వేదికగా రేపు తొలి టీ20 జరగనుండగా అందరిచూపు తెలుగుకుర్రాడు తిలక్వర్మపైనే పడింది. అటు రింకూ సింగ్ ఎలా ఆడుతాడన్నదానిపై కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమికి టీమిండియా దూకుడుగా బ్యాటింగ్ చేయకపోవడమే కారణమన్నాడు గంభీర్. కోహ్లీ యాంకరింగ్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ వేగంగా ఆడకుండా స్లోగా బ్యాటింగ్ చేయడం కొంపముంచిందన్నాడు.
అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికే ఆలోచనలో రోహిత్ శర్మ ఉన్నట్లు తెలుస్తోంది. అటు టీమిండియా భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా వన్డే కెప్టెన్సీని కూడా రోహిత్ వదులుకునే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
వరల్డ్‌కప్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు 'షూ'లో షాంపైన్ పోసుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఏడాది వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత సంబరాల వీడియో కాదు.. 2021 నాటిది.
ఐసీసీ మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు తదుపరి ఓవర్ బౌలింగ్ చేయడానికి బౌలింగ్ జట్టు సిద్ధంగా ఉండకపోతే పెనాల్టీ పడుతుంది. ఇలా చేసిన మొదటి సార్లు వార్నింగ్ ఇస్తారు. మూడో సారి రిపీట్ చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగుల పెనాల్టీ ఇస్తారు.