Cricket: గ్రౌండ్లో విషాదం.. తలకు బాల్ తగిలి క్రికెటర్ మృతి!
ముంబైలోని మాతుంగాలోని మేజర్ ధడ్కర్ మైదాన్‌లో విషాదకర ఘటన జరిగింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 52 ఏళ్ల వ్యక్తి తలపై క్రికెట్ బాల్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అతని పేరు జయేష్ సావ్లా.
ముంబైలోని మాతుంగాలోని మేజర్ ధడ్కర్ మైదాన్‌లో విషాదకర ఘటన జరిగింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 52 ఏళ్ల వ్యక్తి తలపై క్రికెట్ బాల్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అతని పేరు జయేష్ సావ్లా.
మహ్మద్ షమీ..ట్రెండింగ్‌లో ఉన్న క్రికెటర్. వరల్డ్‌కప్‌లో శ్రీలంక మ్యాచ్ తరువాత ఇతని పేరు వరల్డ్‌వైడ్‌గా మారుమోగిపోయింది. అప్పటి నుంచి ఇతనికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. తాజాగా మరోసారి షమీ ట్రెండింగ్ అవుతున్నాడు. అర్జున అవార్డు అందుకుంటున్న వీడియో,అతని పోస్ట్ వైరల్ అవుతున్నాయి.
కేప్‌టౌన్ వేదికగా ఇటీవలి దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో కేవలం 642 బంతులకే మ్యాచ్ ఫలితం వచ్చింది. మ్యాచ్ తర్వాత ఐసీసీపై రోహిత్ ఫైర్ అయ్యాడు. దీనిపై సీరియస్‌గా ఉన్న ఐసీసీ రోహిత్‌ను నిషేధం విధించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.
ఫుట్ బాల్ ప్రపంచంలో తీరని విషాదం నెలకొంది. జర్మనీకి ప్రపంచకప్ అందించిన గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్ ఫ్రాంజ్ బెకెన్బౌర్ కన్నుమూశారు. అతను ఆటగాడిగా, కోచ్‌గా ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు.78 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.
అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్, కోహ్లీని ఎంపిక చేసిన బీసీసీఐ.. కేఎల్‌రాహుల్‌ని మాత్రం పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు శ్రేయస్ అయ్యర్‌ని కూడా సెలక్ట్ చేయలేదు. ఇషాన్ కిషాన్‌పై వేటు పడినట్టుగా అర్థమవుతోంది.
వర్షం కురవడం ఆగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి గొడుగు భారంగా అనిపిస్తుందని.. అవసరాలు తీరిపోయిన తర్వాత విధేయత కూడా ఇలానే అంతం అవుతుందంటూ పొలార్డ్ చేసిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది. ఇది అంబానీ ఫ్రాంచైజీకి చురకలంటించినట్టే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అటు మగురా నియోజకవర్గానికి అవామీ లీగ్ పార్టీ నుంచి పార్లమెంటరీ సీటు సాధించాడు షకీబ్.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భవిష్యత్తులో కోచ్ గా పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 'ఇది నా డ్రీమ్. నేను కోచ్ బాధ్యతలు చేపడితే క్రికెట్ మరింత డైనమిక్ గా మారుతుందని భావిస్తున్నా. కానీ మరికొంత కాలం నేను కుటుంబానికి దూరం కావడం నా భార్య ఒప్పుకుంటుందో లేదో అడగాలి' అన్నారు.
జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్ఘాన్‌తో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. సుదీర్ఘ విరామం తర్వాత పొట్టి ఫార్మెట్లోకి రోహిత్, కోహ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కెప్టెన్‌గా రోహిత్ వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న విషయం తెలిసిందే!