WPL 2026: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2026 ప్రారంభ తేదీ వచ్చేసింది.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. 2026 జనవరి 7 నుంచి ఈ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 3న జరగనుంది. అంటే దాదాపు 28 రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగనుంది. ఈ సీజన్ కోసం రెండు నగరాలను ఎంపిక చేశారు.

New Update
WPL 2026

WPL 2026

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 (WPL) వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలు కానుంది. ఈ టోర్నమెంట్ కోసం భారతదేశంలోని రెండు నగరాలను ఎంపిక చేశారు. ఈ లీగ్ మొత్తం 28 రోజుల పాటు జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

WPL 2026 league Date

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) టోర్నమెంట్‌కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది అంటే 2026 జనవరి 7వ తేదీ నుంచి ఈ WPL 2026 లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 3న జరగనుంది. అంటే దాదాపు 28 రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగనుంది. ఈ సీజన్ కోసం రెండు నగరాలను ఎంపిక చేశారు. 

అందులో నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 కు ఆతిథ్యం ఇవ్వనుంది. మరో నగరం బరోడాలో ఈ లీగ్ టోర్నీ నిర్వహించబడుతుంది. కాగా మహిళల ప్రీమియర్ లీగ్ గత మూడు సీజన్లు మార్చిలోనే ప్రారంభమయ్యాయి. అయితే ఈ సీజన్ జనవరిలో జరుగుతుంది. దానికీ ఓ కారణం ఉంది. 2026 T20 ప్రపంచ కప్ భారతదేశంలో జరగనుంది. అందువల్ల ఈ సీజన్‌ ఉమెన్స్ ఐపీఎల్ టోర్నీని జనవరిలో ఏర్పాటు చేశారు. 

ఇక 2026 మహిళల ప్రీమియర్ లీగ్ కోసం వేలం నవంబర్ 27న న్యూఢిల్లీలో జరుగుతుంది. అప్పుడే దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ అధికారికంగా వెల్లడవుతుంది. 

WPL 2026 కోసం నిలుపుకున్న ఆటగాళ్ల జాబితా

ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్ కౌర్, అమన్‌జోత్ కౌర్, నాట్ స్కైవర్-బ్రంట్, హేలీ మాథ్యూస్, జి కమలిని.

ఢిల్లీ క్యాపిటల్స్: జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, మారిజానే కాప్, అన్నాబెల్ సదర్లాండ్, నికి ప్రసాద్.

గుజరాత్ జెయింట్స్: ఆష్లే గార్డ్నర్, బెత్ మూనీ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, శ్రేయాంక పాటిల్.

యుపి వారియర్జ్: శ్వేతా సెహ్రావత్.

Advertisment
తాజా కథనాలు