/rtv/media/media_files/2025/02/14/PTwooiSwXZHVys7SuVtT.jpg)
RCB vs GG
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)-2025 ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరగనుంది. వడోదరలోని కోటంబి స్టేడియంలో రాత్రి7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.
THE WAIT IS OVER! 🎉
— ᑌTTᗩᗰ GᗩYᗩKᗩᗯᗩᗪ18 (@IAMGAYAKAWAD18) February 14, 2025
The Women's Premier League is here!!!😍😍#WPL2025pic.twitter.com/XuiveezzoY
5 జట్లు పాల్గొనే ఈ టీ20 లీగ్ 2023లో ప్రారంభమైంది. తొలి సీజన్‌లో ముంబై ఇండియన్స్, రెండో సీజన్‌లో ఆర్సీబీ జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ సీజన్ లో స్మృతి మంధాన ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, గుజరాత్ జెయింట్స్‌కు ఆష్లీ గార్డనర్ నాయకత్వం వహిస్తుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్ లు జరగగా... రెండు జట్లు రెండేసి మ్యాచ్ లు గెలిచాయి.
ఇక ఈ టోర్నమెంట్ మొత్తాన్ని నాలుగు వేదికలలో నిర్వహించనున్నారు, వడోదరతో పాటుగా బెంగళూరు, లక్నో, ముంబైలో కొనసాగుతుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 15న ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరగనుంది. పాల్గొనే ఐదు జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే టోర్నమెంట్‌లో ఏ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వదు.
జట్ల అంచనా
గుజరాత్ జెయింట్స్: ఆష్లీగ్ గార్డనర్ (కెప్టెన్), బెత్ మూనీ, దయాలన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకిల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, భారతీ ఫుల్‌మాలి, సయారత్ సిమ్‌రతిన్ దోమాలి, సయారి డేనియల్ గిబ్సన్, ప్రకాశిక నాయక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, నుజత్ పర్వీన్, హీథర్ గ్రాహం, రేణుకా సింగ్, చార్లీ డీన్, ఏక్తా బిష్త్, కిమ్ గార్త్, కనికా జోయత్, దంత్రానీ ప్రేతడ్, దంత్రాని రాఘవి బిస్త్, జాగ్రవి పవార్