/rtv/media/media_files/2024/11/30/sVqadV0isrgAIiF2Xp9x.jpg)
వైభవ్ సూర్య వంశీ...గత వారం ఈ పేరు మారుమోగిసోయింది. ఒకవైపు పెద్ద క్రికెటర్లు వేలంలో తమను ఎవరూ తీసుకోక బిక్కమొహం వేసుకుని కూర్చుంటే...13 ఏళ్ళ బీహార్ కుర్రాడు మాత్రం రూ. 1.10 కోట్ల ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇదో పెద్ద సంచలనం. అసలు 13 ఏళ్ళ కుర్రాడిని తీసుకోవడమే పెద్ద విశేషం. దానికి తోడు ఇతను అంత రేటు పలకడం మరో విశేషం. ఆక్షన్‌లో ఢిల్లీ, రాజస్తాన్ రాయల్స్‌లు ఇద్దరూ పోటీ పడ్డారు వైభవ్‌ను తీసుకోవడానికి చివరకు రాజస్తాన్ ఇతడిని దక్కించుకుంది. వైభవ్ వచ్చే ఐపీఎల్‌లో ఆడనున్నాడు. ప్రస్తుతం ఇతను అండర్–19 ఆసియా కప్‌లో ఆడుతున్నాడు.
బ్రియాన్ లారానే..
ఐపీఎల్ ఆక్షన్‌ను ఫాలో అయినవారిందరి కళ్ళూ ఇప్పుడు వైభవ్ మీద ఉన్నాయి. ఇతను ఏం అద్భుతాలు సృష్టిస్తాడా అని ఎదురు చూస్తున్నారు. అయితే వైభవ్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన ఆట తాను ఆడుకుంటున్నా అని చెబుతున్నాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఆసియా కప్ మీదనే ఉందని అంటున్నాడు. ఇండియన్ క్రికెటర్లు ఎవరూ కాదు తన ఆరాధ్య దైవం బ్రియాన్ లారా అని అంటున్న వైభవ్...అతనిలా ఆడడానికి ప్రయత్నం చేస్తా అని చెబుతున్నాడు. ఆటపరంగా తన నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకుని ముందు వెళతా అంటున్నాడు.
ప్రస్తుతం వైభవ్ మీద చాలా అంచనాలే ఉన్నాయి. అయితే ఆసియా కప్‌లో మాత్రం వైభవ్ మొదటి మ్యాచ్‌లో కేవలం ఒక్క రన్ మాత్రమే చేశాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. అలీ రజా బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Also Read: TS:ఇప్పటికి 150 కోట్లు..తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న ఏఈఈ అక్రమాస్తులు