Cricket: బంగ్లాదేశ్‌తో రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం

బంగ్లాదేశ్ జట్టున భారత కుర్రాళ్ళు చితక్కొడుతున్నారు. ఈ రోజు జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమ్ ఇండియా. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సీరీస్‌ను కైవసం చేసుకుంది. 

t20
New Update

India Vs Bangladesh T20: 

బంగ్లాదేశ్‌ మీద వరుసగా సీరీస్‌లను కొట్టుకొస్తోంది టీమ్ ఇండియా జట్టు. ఇంతకు ముందు టెస్ట్ సీరీస్‌లను సొంతం చేసుకుంది. ఇప్పుడు టీ20 సీరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సీఈస్‌ను ముగించింది. వరుసగా రెండు మ్యాచ్‌లను గెలిచింది టీమ్ ఇండియా. ఈరోజు జరిగిన రెండో మ్యాచ్‌లో బంగ్లా జట్టను 86 పరుగులతో ఓడించింది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది.  నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి 135 పరుగులు చేసింది. మహ్మదుల్లా (41) టాప్ స్కోరర్ గా నిలవగా.. పర్వేజ్ హొస్సేన్ (16), లిటన్ దాస్ (14), నజ్ముల్ శాంటో (11), తౌహిద్ హృదయ్ (2), మెహిదీ హసన్ మిరాజ్ (16) పరుగులు చేశారు. భారత బౌలర్లలో నితీశ్‌ 2, చక్రవర్తి 2, అర్ష్‌దీప్, సుందర్, అభిషేక్, మయాంక్, పరాగ్ తలో వికెట్ పడగొట్టారు. 

ఈరోజు టీమ్ ఇండియాలో తెలుగు కుర్రాడు నితీశ్ ఆల్ రౌండ్ ఆటతో అదరగొట్టాడు. 34 బంతుల్లో 74 పరుగులు చేసి బ్యాటింగ్‌లో ఇరగదీసిన నితశ్ బౌలింగ్‌లో కూడా రెండు వికెట్లు తీసకుని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇతని తర్వాత రింకూ సింగ్ 29 బంతుల్లో 53 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో మెరుపులు మెరిపించాడు. హార్దిక్ పాండ్య (32; 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. కెప్టెన్ సూర్య, మిగిలిన బ్యార్లు పెద్ద స్కోర్లు ఏమీ చేకుండనే వెనుదిరిగారు. మూడో టీ20 నామ్‌కే వాస్తే మ్యాచ్ హైరాబాద్‌లో శనివారం జరగనుంది. 

Also Read: AP: విశాఖలో టీసీఎస్...మంత్రి లోకేశ్ ప్రకటన

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe