/rtv/media/media_files/2025/09/06/team-india-new-jersey-for-asia-cup-2025-revealed-2025-09-06-20-42-28.jpg)
team india new jersey for asia cup 2025 revealed
క్రికెట్ ప్రియులకు మరో మూడు రోజుల్లో అదిరిపోయే పండగ రాబోతుంది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 2025 ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా టీమిండియా సరికొత్త జెర్సీతో మ్యాచ్‌లను ఆడనుంది. అంటే ఇప్పుడున్న జెర్సీలోనే చిన్న చిన్న మార్పులు చేసింది. ఈ సారి టీమిండియా జెర్సీ స్పాన్సర్ లేకుండా.. బ్లాంక్ జెర్సీలతోనే బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో BCCI ఇప్పుడు కొత్త జెర్సీ స్పాన్సర్స్ కోసం టెండర్ జారీ చేసింది.
Asia Cup 2025
దీంతో మ్యాచ్‌లకు సమయం దగ్గర పడుతుండటంతో టీమిండియా జెర్సీలపై కొత్త స్పాన్సర్ ఎవరైనా వస్తారా? లేదా? అనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జట్టులో ఒకరైన శివం దూబే క్రికెట్ ప్రియులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించారు. తాజాగా కొత్త కిట్‌ను విడుదల చేశారు. అందులో శివం దూబె టీమిండియా జెర్సీతో దిగిన ఫొటో ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ ఇచ్చింది.
శివం దూబే కొత్త జెర్సీని ధరించి ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో జెర్సీలో టోర్నమెంట్ పేరు, దేశం పేరు మాత్రమే ఉన్నట్లు స్పష్టంగా చూడవచ్చు. గతంలో డ్రీమ్11 అంటూ స్పాన్సర్ పేరు ఉండేది.. ఇప్పుడు BCCIతో Dream11 ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఆ స్థలం ఖాళీగా ఉంది. అయితే డ్రీమ్ 11 ఎందుకు తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది అనే విషయానికొస్తే..
Team India New Jersey
ఇటీవల పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025పై సంతకం చేయడంతో అది ఆమోదం పొందింది. దీంతో టీమిండియాకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీని కారణంగా టీమ్ ఇండియా ప్రస్తుతం స్పాన్సర్ లేకుండా ఆడబోతుంది. ఈ రద్దు అనంతరం బీసీసీఐ టీమిండియా కొత్త స్పాన్సర్ కోసం ఎదురు చూస్తోంది. ఆసక్తి ఉన్న కంపెనీలు సెప్టెంబర్ 16 లోగా బిడ్డింగ్ దాఖలు చేయవచ్చు. కాగా డ్రీమ్ 11 బీసీసీఐతో 2026 వరకు ఒప్పందం చేసుకుంది. కానీ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో డ్రీమ్ 11 తన ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకుంది.
దీని అనంతరం బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ఇటీవల మాట్లాడుతూ.. బోర్డు, డ్రీమ్11 పరస్పరం సంబంధాన్ని ముగించుకున్నాయని తెలిపారు. అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025పై సంతకం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.