Team India Captain Rohith Sarma:
మరికొన్ని గంటల్లో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తెరలేవనుంది. శుక్రవారం అంటే రేపటి నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇందులో ఇప్పటికే కొత్త కుర్రాళ్ళకు అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు సంబంధించి భారత అభిమానులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది బీసీసీఐ. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా బయలుదేరుతున్నాడని తెలిపింది.
కొద్దిసేపటి క్రితం వరకూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడనే అనుకుంటున్నారు అందరూ. అతని భార్య ఈ మధ్యనే ఐదు రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో రోహిత్ మొదటి టెస్ట్ ఆడటం లేదని బీసీసీఐ చెప్పింది. అయితే తాజా సమాచారం ప్రకారం కెప్టెన్ రోహిత్ ఆస్ట్రేలియాకు బయలుదేరారని తెలుస్తోంది. దీంతో రెండు టెస్టులు ముగిశాక రోహిత్ భారత జట్టుతో కలుస్తాడని వార్త నిజం కాదని తేలిపోయింది. తాను ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు రోహిత్ బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం.
రోహిత్ నవంబర్ 23న ముంబయి నుంచి బయలుదేరాల్సి ఉంది. అతను 24న పెర్త్ చేరుకుంటాడు. తర్వాత అడిలైడ్‌లో జరిగే డే-నైట్ టెస్టుకు ఎలా సన్నద్ధం కావాలనే దానిపై కోచింగ్ స్టాఫ్‌తో చర్చిస్తాడు.కాన్‌బెర్రాలో జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ చెప్పింది. మరోవైపు టెస్ట్‌లో అడించేందుకు కుర్రాళ్ళకు అవకాశం ఇచ్చింది బీసీసీఐ. మొదటి టెస్ట్‌లోనే నితీశ్ రెడ్డి, సర్ఫరాజ్, దేవదత్ లాంటి వారికి అవకాశం ఇవ్వొచ్చునని తెలుస్తోంది.
Also Read: RBI: ఐదు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన ఆర్బీఐ..భారీ జరిమానా