/rtv/media/media_files/2025/03/23/8J0QeKe3Lndu09CJEQx8.jpg)
ఉప్పల్ స్డేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోయి మరీ ఆడుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో దంచి కొడుతున్నారు. 10 ఓవర్లకే జట్టు స్కోర్ 130 పరుగులు దాటింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్రైజర్స్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు.
Kavya Maran All Smiles As #AbhishekSharma, #TravisHead, #IshanKishan Give Sunrisers Hyderabad Flying Start in Powerplay During SRH vs RR IPL 2025 Match (See Pic)#KavyaMaran | #SRHvRR | #IPL2025 | #IPL | #SRHvsRR | #RRvsSRHhttps://t.co/bnEGM7eFL5
— LatestLY (@latestly) March 23, 2025
ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ
3 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 45 దాటింది. దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ (24)ను మహీష్ తీక్షణ ఔట్ చేశాడు. దీంతో సన్రైజర్స్ మొదటి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తో కలిసి ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, మూడు సిక్సులున్నాయి. ప్రస్తుతం 10 ఓవర్లకు సన్రైజర్స్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 130గా ఉంది. ట్రావిస్ హెడ్(67 ) పరుగుల వద్ద ఔటయ్యాడు. తుషార్ దేశ్ పాండే బౌలింగ్‌లో హిట్ మేయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇషాన్ కిషన్ (34), నితీష్ కుమార్ రెడ్డి(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Also Read : NZ vs PAK : ఇజ్జత్ తీసుకున్న పాక్.. సిరీస్ గోవిందా గోవింద!