SRH vs DC : తడబడిన సన్‌రైజర్స్ .. ఆదుకున్న రూ. 30లక్షల ఆటగాడు!

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 163 పరుగులకు చాపచుట్టేసింది. యువ ఆటగాడు అనికేత్ వర్మ ఒక్కడే పర్వాలేదనిపించాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు.

New Update
aniket varma

aniket varma


వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 163 పరుగులకు చాపచుట్టేసింది. యువ ఆటగాడు అనికేత్ వర్మ ఒక్కడే పర్వాలేదనిపించాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఆరు సిక్సులున్నాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ కు తొలి ఓవర్‌ లోనే బిగ్ షాక్ తగిలింది. ఓవర్ ఐదో బంతికి అభిషేక్‌(1) రనౌట్‌గా వెనుదిరిడాడు. ఆ తరువాత మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో  స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ కిషన్‌ (2) కూడా వెనుదిరిగాడు.  ఆ వెంటనే మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో భారీ షాట్ఆడబోయిన నితీశ్‌కుమార్‌ రెడ్డి అక్షర్‌ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌ అయ్యాడు. ఇక కాస్త దూకుడుగా ఆడుతున్న ట్రావిస్‌ హెడ్‌ (22) కూడా మిచెల్ స్టార్క్ బౌలింగ్ లోనే కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అనికేత్ వర్మ దూకుడు

దీంతో 50 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టును హెన్రిచ్ క్లాసెన్(32), అనికేత్ వర్మ(74) ఆదుకున్నారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. అయితే దూకుడుగా ఆడుతున్న హెన్రిచ్‌ క్లాసెన్‌..  మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో విప్రాజ్ నిగమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 115పరుగులకే హైదరాబాద్ సగం వికెట్లు కోల్పోయింది. ఒక పక్క వికెట్లు పడుతున్న అనికేత్ వర్మ  మాత్రం దూకుడుగా ఆడాడు. ఫోర్లు, సిక్సులతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకపడ్దాడు.16 ఓవర్లో కుల్‌దీప్‌యాదవ్‌ బౌలింగ్‌లో జెక్‌ఫ్రేజర్‌కు క్యాచ్ ఇచ్చి అనికేత్‌ వర్మ ఔటయ్యాడు. అనంతరం సన్‌రైజర్స్ పతనం షురూ అయింది.  ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్  మిచెల్‌ స్టార్క్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు.  3.4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు స్టార్క్‌.  

SRH: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ


DC: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, KL రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్

Also Read:  Devara Japan Collections: జపాన్​లో దేవర 'ఫెయిల్'..!! అందరి ముందు పరువు పోయిందిగా..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు