BIG BREAKING: అంతర్జాతీయ క్రికెట్‌కు క్లాసెన్ రిటైర్మెంట్

సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తమ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది ‘‘కష్టమైన నిర్ణయం’’ అని అన్నాడు.

New Update
Heinrich Klaasen

Heinrich Klaasen Photograph: (Heinrich Klaasen)

సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తమ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది ‘‘కష్టమైన నిర్ణయం’’ అని అన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించాడు. 

ఇప్పటికే టెస్టు క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన క్లాసెన్.. ఇప్పుడు టీ 20, వన్డేలకు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశాడు. అతడు 33 ఏళ్ల వయసులో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. 

మాక్స్‌వెల్ సైతం రిటైర్మెంట్

మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మాక్స్‌వెల్ చివరిగా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఇందులో ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్‌లో ఓడిపోయింది. 149 వన్డేలు ఆడిన మాక్స్ వెల్ 33.81 సగటుతో 3990 పరుగులు చేశాడు, ఇందులో నాలుగు సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి మాక్స్‌వెల్  మాట్లాడుతూ ..  క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ జార్జ్ బెయిలీతో తాను మాట్లాడానని, 2027 వన్డే ప్రపంచ కప్ వరకు తాను ఆడబోనని చెప్పానని మాక్స్‌వెల్ చెప్పాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు