/rtv/media/media_files/2024/11/29/3pNVY5hkqoDeWPZe55GB.jpg)
భారత మహిళా క్రికెటర్ స్మృతీ మంధాన తాను ప్రేమలో పడి ఐదేళ్లు పూర్తైనట్లు తెలిపింది. ఈ మేరకు ప్రియుడు, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా ప్రేమికులిద్దరూ తమ రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు సాధారణంగా సిగ్గు ఎక్కువని, పార్టీల్లోనే కాదు ఎక్కడైనా ఫొటోలు దిగాలంటూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతానని పలాష్ చెప్పాడు.
సిగ్గు, బిడియం ఎక్కువ..
‘నాకు సిగ్గు, బిడియం ఎక్కువ. ఫొటోలు దిగాలంటే కష్టంగా ఫీల్ అవుతా. స్మృతీ బాయ్‌ఫ్రెండ్‌ని అయినందుకు నేనెంతో గర్వపడుతున్నా. నా పర్సనల్ లైఫ్ గురించి రహస్యంగా ఉంచడానికే ఇష్టపడతా. అందుకే దీని గురించి ఓపెన్ కాలేదు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) సమయంలో ఆమెతో గ్రౌండ్ లో ఉన్నప్పుడు కెమెరా చూడలేదు. కెమెరా మమ్మల్ని చూస్తే అక్కడినుంచి వెళ్లిపోయేవాడిని. ఇప్పుడు మా బంధం గురించి అందరికీ తెలిసింది. ఎక్కడికెళ్లినా ఆర్‌సీబీ, ఆర్‌సీబీ అని కేకలు వేస్తున్నారు. మ్యూజిక్ కంపోజర్‌గా నేను అందరికీ సుపరిచితమే' అంటూ చెప్పుకొచ్చాడు పలాస్.