Shreyas Iyer Health: శ్రేయాస్ అయ్యర్ హెల్త్‌పై బిగ్ అప్డేట్.. BCCI సంచలన ప్రకటన

శ్రేయాస్ అయ్యర్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతడి గాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ బయటకొచ్చింది. అతడు ఐసీయూ నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం అతడి ప్రాణానికి పెద్దగా ప్రమాదం లేదని.. కానీ డిశ్చార్జ్ అయ్యేందుకు కొంచెం సమయం పడుతుందని తెలుస్తోంది.

New Update
Shreyas Iyer out of ICU

Shreyas Iyer out of ICU

శ్రేయాస్ అయ్యర్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తాజాగా అతడి గాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ బయటకొచ్చింది. అతడు ఐసీయూ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతడి ప్రాణానికి పెద్దగా ప్రమాదం లేదని.. కానీ డిశ్చార్జ్ అయ్యేందుకు కొంచెం సమయం పడుతుందని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Shreyas Iyer Health

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ తీసుకుంటూ శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. అంతర్గత రక్తస్రావం కావడంతో అతన్ని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం నిమిషాల్లోనే శ్రేయాస్ పరిస్థితి దిగజారడంతో.. అతన్ని సిడ్నీలోని ఒక హాస్పిటల్‌ ICUలో అడ్మిట్ చేశారు. దీంతో క్రికెట్ ప్రియులు, శ్రేయాస్ అభిమానుల్లో ఆందోళన పెరిగింది. అయితే తాజాగా అయ్యర్ ఆరోగ్యంపై బిగ్ అప్డేట్ బయటకొచ్చింది. 

శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని బీసీసీఐ ఒక అప్‌డేట్ ఇచ్చింది. అదే సమయంలో భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ ఐసీయూ నుంచి బయటకొచ్చారని క్రిక్‌బజ్ సైతం తన వెబ్‌సైట్‌లో తెలిపింది. కాగా ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదని.. ఐసీయూ నుంచి విడుదల కావడం అంటే అయ్యర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని.. అతడు త్వరలోనే కోలుకుంటాడని అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అదే సమయంలో అయ్యర్ తల్లిదండ్రులు వీలైనంత త్వరగా ఆయనను కలవడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. 

శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ.. అతను ఇంకా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాలేదు. అతను మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఉండనున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవాలంటే దాదాపు 2 నెలల సమయం పడుతుందని సమాచారం. అంటే జనవరి నాటికి శ్రేయాస్ పూర్తిగా కోలుకుని మళ్లీ గ్రౌండ్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. 

కాగా నవంబర్ చివరిలో, డిసెంబర్ ప్రారంభంలో భారత్ VS దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో ఆడనున్నాయి. అయితే శ్రేయాస్ త్వరగా కోలుకునే అవకాశం లేదు కాబట్టి ఈ సిరీస్‌లో అయ్యర్ పాల్గొనే అవకాశం లేదు. అయితే జనవరిలో భారత్ VS న్యూజిలాండ్ మూడు వన్డేలు ఆడనున్నాయి. అయితే అయ్యర్ అప్పటికి మైదానంలోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు