ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. CSK నుంచి జడేజా ఔట్.. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ మిస్సింగ్‌!

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల హృదయం ఆగేంతటి వార్త ఇది.  అవును మరి... ఆ జట్టు కీలక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ 2026సీజన్‌కు ముందు జట్టును వీడుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

New Update
jadeja

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల హృదయం ఆగేంతటి వార్త ఇది.  అవును మరి... ఆ జట్టు కీలక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ 2026సీజన్‌కు ముందు జట్టును వీడుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ తీవ్ర చర్చల మధ్య, జడేజా సోషల్ మీడియాలో చేసిన ఒక అనూహ్య చర్య యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. రవీంద్ర జడేజా  ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ కనిపించలేదు.  దీంతో  జడేజాను వదులుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఏ కారణం వల్ల జడేజా అకౌంట్ కనిపించకుండా పోయిందో అనేది మాత్రం తెలియరాలేదు. 

ధోని తర్వాత జట్టుకు

జడేజా ఇన్‌స్టాగ్రామ్ మాయం కావడానికి, ఐపీఎల్ ట్రేడింగ్ చర్చలకు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ సంజూ శాంసన్ ను తమ జట్టులోకి తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ధోని తర్వాత జట్టుకు దీర్ఘకాలిక వికెట్ కీపింగ్, కెప్టెన్సీ ఎంపికగా శాంసన్‌ను CSK భావిస్తోంది. సంజూ శాంసన్‌ను ట్రేడ్ చేయాలంటే, ప్రతిగా CSK తమ కీలక ఆటగాళ్లైన రవీంద్ర జడేజా, మరో ఆటగాడిని (సామ్ కరన్ లేదా మతీశ పతిరణ పేర్లు వినిపిస్తున్నాయి) ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ పట్టుబడుతున్నట్లు సమాచారం.

ఈ ట్రేడ్‌కు జడేజాను ఒప్పించడానికి, మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని, ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌లతో సుదీర్ఘ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జడేజా కూడా ఈ మార్పుకు అంగీకారం తెలిపిన తర్వాతే ట్రేడ్ చర్చలు తుది దశకు చేరుకున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

జడేజా 2012 నుంచి CSK విజయాలలో ప్రధాన పాత్ర పోషించారు. 2023 ఫైనల్‌లో చివరి రెండు బంతుల్లో విజయం అందించిన హీరో ఆయనే. అలాంటి ఆటగాడిని కేవలం ట్రేడింగ్ కోసం వదులుకోవడం, CSK విధేయత సంస్కృతికి విరుద్ధమని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్లాక్‌బస్టర్ ట్రేడింగ్‌పై తుది ప్రకటన నవంబర్ 15న రిటెన్షన్ గడువు ముగిసేలోపు వెలువడే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు