/rtv/media/media_files/2025/09/23/pakistan-2025-09-23-15-52-02.jpg)
పాకిస్థాన్ క్రికెటర్లు ఇండియాపై సమయం వచ్చినప్పుడల్లా విషం కక్కుతూనే ఉన్నారు. పురుష క్రికెటర్లే కాదు మహిళా క్రికెటర్లు కూడా తామేమీ తక్కువ కాదంటున్నారు. తాజాగా ఆసియాకప్ లో భాగంగా ఇండియాతో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ అభిమానులతో అనుచితంగా ప్రవర్తించాడు. విమానం కూలిపోతున్నట్లుగా సైగలు చేశాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన సైనిక పోరాటంలో ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామంటూ అభిమానుల వైపు ‘6-0’ అని సైగ చేశాడు అంతేకాకుండా ఆ తర్వాత విమానాలు కూలిపోతున్నట్లు చేతి సైగలు కూడా చేశాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది.
Alhamdullillah,
— Nashra Sundhu (@nashra_sundhu06) September 22, 2025
Truly humbled to reach the milestone of 100 ODI wickets with a player of the match award😇 I am grateful to my family, teammates, and support staff for their constant support.
Looking ahead with gratitude and determination.🙏 pic.twitter.com/E3GUasY2CR
ఇలాంటి తరహా విన్యాసమే
పాకిస్థాన్ మహిళా క్రికెటర్ నష్రా సుంధు కూడా ఇలాంటి తరహా విన్యాసమే చేసింది.సోమవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో నష్రా సుంధు పాకిస్తాన్ మహిళా జట్టు తరపున ఆడింది. ఆమె ఆటలో ఆరు వికెట్లు పడగొట్టి, వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన పాకిస్తానీ మహిళగా నిలిచింది. ఆమె అత్యుత్తమ ఆల్ రౌండ్ ప్రదర్శనకు, నష్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ తర్వాత సుంధు సోషల్ మీడియాలో తన ఆరు వేళ్లను చూపిస్తూ ఫోటోను షేర్ చేసింది. పాకిస్తాన్‌లోని అభిమానులు ఆమె పోస్ట్‌ను షేర్ చేస్తూ భారత్ కు కౌంటర్ గానే ఆమె ఇలా చేశారని కామెంట్స్ చేస్తున్నారు.
నష్రా సంధు 19 నవంబర్ 1997న పంజాబ్‌లోని లాహోర్‌లో జన్మించారు. ఆమె కుడిచేతి బ్యాటర్, ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్. 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో అత్యధిక వికెట్లు (17 వికెట్లు) తీసిన క్రీడాకారిణిగా నిలిచారు. నవంబర్ 2023లో, ICC మహిళల T20I బౌలర్ల ర్యాంకింగ్‌లలో ఆమె 5వ స్థానానికి చేరుకున్నారు, ఇది ఆమె కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్. 2025 సెప్టెంబర్‌లో లాహోర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రదర్శన ఆమె కెరీర్‌లో ఒక మైలురాయి. ఆమె 26 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి కెరీర్‌లో అత్యుత్తమ వన్డే గణాంకాలను సాధించడమే కాకుండా, ఆ మ్యాచ్‌లో తన 100వ వన్డే వికెట్‌ను కూడా తీసింది.