Pakistan : ఫామ్‌హౌస్‌లో పనిమనిషిపై లైంగిక దాడి.. పాక్ మాజీ క్రికెటర్ కొడుకు ఎంతకు తెగించాడంటే?

పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సులామన్ పై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. ఫామ్ హౌస్ లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పనిమనిషి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది

New Update
pak

పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సులామన్ పై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. ఫామ్ హౌస్ లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పనిమనిషి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సులామన్ ఇంట్లో తాను పనిచేశానని, అతను తనను బలవంతంగా తన ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తన ఎఫ్ఐఆర్ లో ఆమె ఆరోపించింది.  

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సులేమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే అత్యాచారం జరిగిన విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు. 

అంతరించిపోతున్న లెగ్-స్పిన్ కళకు

ఇక సులేమాన్ ఖాదిర్ విషయానికి వస్తే ఆయన గతంలో క్రికెటర్ గా రాణించారు. ఆయన 2005 నుండి 2013 మధ్య కాలంలో 26 ఫస్ట్-క్లాస్, 40 లిస్ట్-A మ్యాచ్‌లు ఆడారు.1980వ దశకంలో అంతరించిపోతున్న లెగ్-స్పిన్ కళకు ఆయన ప్రాణం పోశారని చెబుతూ ఉంటారు పాక్ అభిమానులు. పాకిస్థాన్ తరఫున 67 టెస్టులు, 104 వన్డేలు ఆడిన ఆయన సెప్టెంబర్ 2019లో కన్నుమూశారు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది.

Advertisment
తాజా కథనాలు