India-Pak Asia Cup match: చనిపోయిన వ్యక్తి బతికి వస్తేనే ఇండియా-పాక్ మ్యాచ్.. పహల్గామ్ బాధితుడి డిమాండ్

ఇండియా-పాక్ ఆసియా కప్ మ్యాచ్‌పై వ్యతిరేకత వస్తోంది. నేడు దుబాయ్‌లో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. పహల్గాం ఉగ్రదాడి బాధితుడు సావన్ పర్మార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రికత్తలు పెరిగాయి.

New Update
india pak mach

ఇండియా- పాక్ ఆసియా కప్ మ్యాచ్‌పై వ్యతిరేకత వస్తోంది. నేడు దుబాయ్‌లో జరగనున్న భారత్-పాకిస్థాన్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. పహల్గాం ఉగ్రదాడి బాధితుడు సావన్ పర్మార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్- ఇండియా ఉద్రికత్తలు పెరిగాయి. ఈ క్రమంలో పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించి బాధిత కుటుంబాల ఆందోళన తీవ్రతరం అవుతోంది.

'నా సోదరుడిపై కాల్పులు జరిగాయి, అతన్ని తిరిగి నాకు ఇవ్వండి, తర్వాతే పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడండి..', పహల్గామ్ ఉగ్రవాద దాడిలో తన తండ్రి, సోదరుడిని కోల్పోయిన సావన్ పర్మార్ ఇలా అన్నాడు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో నివసించే సావన్ పర్మార్, ఆసియా కప్‌లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ చర్యలను ఆయన ప్రశ్నించారు. 

Advertisment
తాజా కథనాలు