Cricketer Akash Kumar: 6,6,6,6,6,6.. 11 బంతుల్లో హాఫ్ సెంచరీ - దుమ్ములేపిన భారత క్రికెటర్

మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో.. ఆకాష్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని సాధించాడు.

New Update
Cricketer Akash Kumar

Cricketer Akash Kumar

మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో.. ఆకాష్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని సాధించాడు. సూరత్‌లోని పితావాలా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆకాష్ కేవలం 11 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని చేసి ఎవరూ సాధించలేని రికార్డు నెలకోల్పాడు. 

Cricketer Akash Kumar

దీంతో ఆకాష్ కుమార్ చౌదరి.. వేన్ వైట్ పేరిట ఉన్న పాత రికార్డును బద్దలు కొట్టాడు. 2012లో ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ తరపున ఆడిన వేన్ వైట్ కేవలం 12 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని సాధించాడు. ఇప్పుడు ఆకాశ్ అతడి పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో లిమార్ దాబి వేసిన 126వ ఓవర్‌లో ఆకాష్ వరుసగా ఆరు బంతులను సిక్సర్లుగా బాది హాఫ్ సెంచరీ సాధించి మరో రికార్డు నెలకొల్పాడు. 

ఇలా రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక ఆటగాడు ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టడం ఇది రెండోసారి కావడం విశేషం. అదే సమయంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒక బ్యాట్స్‌మన్ ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టడం ఇది మూడోసారి.

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీ

11 బంతుల్లో- ఆకాష్ కుమార్ చౌదరి..- మేఘాలయ vs అరుణాచల్ ప్రదేశ్ - 2025
12 బంతుల్లో- వేన్ వైట్.. లీసెస్టర్‌షైర్ vs ఎసెక్స్, 2012
13 బంతుల్లో- వాన్ వురెన్.. తూర్పు ప్రావిన్స్ B vs గ్రిక్వాలాండ్ వెస్ట్, 1984/85
14 బంతుల్లో- నెడ్ ఎకర్స్లీ.. లీసెస్టర్‌షైర్ vs ఎసెక్స్, 2012
15 బంతుల్లో- ఖలీద్ మహమూద్.. గుజ్రాన్‌వాలా vs సర్గోధ, 2000/01
15 బంతుల్లో- బందిప్ సింగ్.. జమ్మూ & కాశ్మీర్ vs త్రిపుర, 2015/16

Advertisment
తాజా కథనాలు