/rtv/media/media_files/2025/05/23/CVBU1IrI2CGPGAqyNi12.jpg)
ఐపీఎల్ లో భాగంగా లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 94*, అభిషేక్ శర్మ 34 రాణించారు. రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లలో షెఫర్డ్ 2, కృనాల్ పాండ్య, సుయాశ్ శర్మ,, లుంగి ఎంగిడి, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్, సీజన్‌ను ఘనంగా ముగించాలని చూస్తోంది. అటు బెంగళూరు ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరుకుంది.
📢 Target Set!
— Devi prasad Mishra (@devimishra2025) May 23, 2025
SRH finish strong at 231/6. Now, RCB need 232 in 20 overs to win Match 65!
Can Kohli & Co. chase down this massive total? 💪🔥#RCBvSRH #TATAIPL #SRH #RCB pic.twitter.com/TcmZBwOjxp
𝑩𝒂𝒄𝒌 𝒘𝒊𝒕𝒉 𝒂 𝒃𝒂𝒏𝒈! 💥
— Sportskeeda (@Sportskeeda) May 23, 2025
Ishan Kishan smashes an unbeaten 94 to guide SRH to a huge total. 🔥
Pocket dynamo at his best! ⚡️#IPL2025 #IshanKishan #RCBvSRH pic.twitter.com/3KxAd1GTKa
జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (సి), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (WK), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ (c/wk), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, లుంగి ఎన్గిడి, సుయాష్ శర్మ
rcb-vs-srh | IPL 2025 | sunrisers-hyderabad | royal-challengers-bengaluru