ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలం ఘనంగా ముగిసింది. జెడ్డాలో రెండు రోజులు పాటు జరిగిన ఈ మెగా వేలంలో మొత్తం 182 మంది దేశీ, స్వదేశీ ప్లేయర్లు అమ్ముడుపోయారు. వీరి కోసం మొత్తం పది ఫ్రాంచైజీలు రూ. 639.15 కోట్లు ఖర్చుచేశాయి. ఈ సీజన్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్మడయిపోయాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఇతనిది అత్యధిక ధర. రూ.27 కోట్ల భారీ ధరకు రిషబ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యార్‌ను పంజాబ్ కింగ్స్.. రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అలాగే టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కూడా భారీ ధర పలికాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని రూ.23.75 కోట్లకు తీసుకుంది. ఇక మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. కొనుగోలు అయిన ఆటగాళ్ళల్లో 62 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. 8 మందిని జట్లు ఆర్టీఎం చేసుకున్నాయి.
తెలుగు కుర్రాళ్ళు...
మెగా వేలంలో ఆంధ్ర ఆటగాళ్లు పైలా అవినాష్, సత్యనారాయణ రాజు, షేక్ రషీద్ అమ్ముడుపోయారు. షేక్ రషీద్ ఇప్పటికే ఐపీఎల్‌లో ఓసారి సీఎస్‌కే జట్టులో భాగం కాగా.. అవినాష్, సత్యనారాయణలకు మాత్రం మొదటిసారి ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కింది. విశాఖపట్నంకు చెందిన అవినాష్‌ను కనీస ధర రూ. 30 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇక గుంటూరు క్రికెటర్ షేక్ రషీద్‌ను మరో సారి సీఎస్‌కే సొంతం చేసుకుంది. అతడు కూడా తన బేస్ ప్రైస్ రూ.30 లక్షలకే అమ్ముడుపోయాడు.
మెగా వేలం తర్వాత కూడా ఫ్రాంఛైజీల దగ్గర ఫండ్స్ మిగలే ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నై సూపర్‌కింగ్స్
క్రికెటర్లు: 25 (విదేశీ ఆటగాళ్లు 7)
మిగిలిన మొత్తం: రూ. 5 కోట్లు
దిల్లీ క్యాపిటల్స్
క్రికెటర్లు: 23 (విదేశీ ఆటగాళ్లు 7)
మిగిలిన మొత్తం: రూ.20లక్షలు
గుజరాత్ టైటాన్స్
క్రికెటర్లు: 25 (విదేశీ ఆటగాళ్లు 7)
మిగిలిన మొత్తం: రూ. 15లక్షలు
కోల్‌కతా నైట్ రైడర్స్
క్రికెటర్లు: 21 (విదేశీ ఆటగాళ్లు 8)
మిగిలిన మొత్తం: రూ. 5లక్షలు
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
క్రికెటర్లు: 24 (విదేశీ ఆటగాళ్లు 6)
మిలిగిన మొత్తం: రూ.10లక్షలు
ముంబయి ఇండియన్స్
క్రికెటర్లు: 23 (విదేశీ ఆటగాళ్లు 8)
మిగిలిన మొత్తం: రూ.20 లక్షలు
పంజాబ్ కింగ్స్
క్రికెటర్లు: 25 (విదేశీ ఆటగాళ్లు 8)
మిగిలిన మొత్తం: రూ. 35 లక్షలు
రాజస్థాన్ రాయల్స్
క్రికెటర్లు: 20 (విదేశీ ఆటగాళ్లు 6)
మిగిలిన మొత్తం: రూ.30లక్షలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
క్రికెటర్లు: 22 (విదేశీ ఆటగాళ్లు 8)
మిగిలిన మొత్తం: రూ. 75లక్షలు
సన్‌రైజర్స్ హైదరాబాద్
క్రికెటర్లు: 20 (విదేశీ ఆటగాళ్లు 7)
మిగిలిన మొత్తం: రూ. 20లక్షలు
Also Read: Union Cabinet: పాన్ కార్డ్ 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం..