/rtv/media/media_files/2026/02/09/championships-2026-02-09-08-16-23.jpg)
శ్రతుదేశమైన చైనాపై మన జాతీయ గీతం మారుమోగింది. చైనాలోని టియాంజిన్ వేదికగా జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2026లో తేజస్విన్ శంకర్ పురుషుల హెప్టాథ్లాన్ విభాగంలో విజయాన్ని సాధించారు. మొత్తం ఏడు రకాల ఈవెంట్స్ ఉండే ఈ పోటీలో ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 5993 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. తేజస్విన్ శంకర్ మెడల్ తీసుకుంటుండగా ఇండియా నేషనల్ అంథమ్ జన గణ మన వేశారు.
Indian National Anthem in China 🇨🇳 🇮🇳
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 8, 2026
HISTORIC! Tejaswin Shankar wins GOLD in Men's Heptathlon at Asian Indoor Athletics Championships 2026 in Tianjin.
Sets massive National Record with 5993, Just 7 pts short of 6000 barrier 🙌 pic.twitter.com/oAfgPOAubd
ఈ క్రమంలో తేజస్విన్ తన పాత రికార్డును తానే తిరగరాస్తూ సరికొత్త జాతీయ రికార్డును సృష్టించారు. 6000 పాయింట్ల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 7 పాయింట్ల దూరంలో నిలిచిపోయినప్పటికీ, ఆసియా స్థాయిలో స్వర్ణ పతకం సాధించి భారత్ గర్వపడేలా చేశారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 60 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్‌పుట్, హైజంప్, 60 మీటర్ల హర్డిల్స్, పోల్ వాల్ట్, 1000 మీటర్ల పరుగు పందెం ఉన్నాయి. ప్రతి విభాగంలోనూ బెస్ట్ పర్ఫామెన్స్ చేస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కాపాడుకున్నారు. ముఖ్యంగా హైజంప్‌లో ఆయన సాధించిన పాయింట్లు విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన ఏకైక స్వర్ణ పతకం ఇదే కావడం గమనార్హం. గతంలో ఆసియా క్రీడల్లోనూ పతకాలు సాధించిన తేజస్విన్, ఇప్పుడు ఇండోర్ అథ్లెటిక్స్‌లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఒక భారతీయ అథ్లెట్ చైనాలో విజేతగా నిలిచి త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయడం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసింది.
Follow Us