/rtv/media/media_files/2025/10/31/india-vs-australia-melbourne-t20-2025-10-31-15-21-56.jpg)
india vs australia melbourne t20
భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఇవాళ మెల్‌బోర్న్ వేదికగా ఇరుజట్లు తలపడుతున్నాయి. అక్టోబర్ 29న ఈ సిరీస్ ప్రారంభం కాగా.. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలో ఆగిపోయింది. దీంతో ఇరు జట్లకు చెరోపాయింట్ వచ్చింది. ఇక ఇవాళ రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
india vs australia melbourne t20
అయితే టాస్ తర్వాత రెండు జట్లు నల్ల బ్యాండ్‌లు ధరించి కనిపించాయి. ఇవాళ్టి మ్యాచ్‌లోనే కాకుండా.. నిన్న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మహిళల ప్రపంచ కప్ 2025 మ్యాచ్ సందర్భంగా రెండు జట్లు నల్ల బ్యాండ్‌లు ధరించాయి. అయితే దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. దాని విషయానికొస్తే..
India, Australia Players Wear Black Armbands In 2nd T20I. This Is The Reasonhttps://t.co/aJquTDg38Spic.twitter.com/I6EaqJ8hV7
— CricketNDTV (@CricketNDTV) October 31, 2025
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇరు జట్లు నల్ల బ్యాండ్‌లు ధరించాయి. దీనికి కారణం 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ అనే ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మరణం అనే చెప్పాలి. ఎందుకంటే.. అక్టోబర్ 30వ తేదీ ఉదయం అతడు మరణించాడు. టీ20 మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు.. ఆస్టిన్ మెడకు సైడ్ ఆర్మ్ బాల్ తగిలింది. దీంతో అతడిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆస్టిన్ ప్రాణాలు కోల్పోయాడు.
అతడి మరణం కారణంగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు నివాళులర్పిస్తూ మెల్‌బోర్న్ స్టేడియంలో నల్ల బ్యాండ్‌లు ధరించి కనిపించాయి. అంతకుముందు భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్లు కూడా ఇదే కారణంతో నల్ల బ్యాండ్‌లు ధరించి సెమీఫైనల్ మ్యాచ్ ఆడాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండు జట్ల ఆటగాళ్లు మైదానంలో కొద్దిసేపు మౌనం పాటించారు. క్రికెట్ ఆస్ట్రేలియా బెన్ ఆస్టిన్ కు నివాళులర్పించింది. భారత ఆటగాళ్లు కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు.
Follow Us