IND Vs AUS: వర్షం ముప్పు.. మధ్యలో ఆగిపోయిన భారత్, ఆసీస్ ఆఖరి మ్యాచ్

ఆస్ట్రేలియాతో గబ్బాలో జరుగుతోన్న చివరి టీ20 మ్యాచ్ తాజాగా ఆగిపోయింది. హెవీ రెయిన్ కారణంగా మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉండటంతో ముందుగానే మ్యాచ్‌ను నిలిపివేశారు.

New Update
india vs australia 5th t20 match stop due to rain

india vs australia 5th t20 match stop due to rain

ఆస్ట్రేలియాతో గబ్బాలో జరుగుతోన్న చివరి టీ20 మ్యాచ్ తాజాగా ఆగిపోయింది. హెవీ రెయిన్ కారణంగా మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉండటంతో ముందుగానే మ్యాచ్‌ను నిలిపివేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

india vs australia 5th t20

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్‌లోని చివరి, ఐదవ మ్యాచ్ ఇవాళ గబ్బా స్టేడియంలో జరుగుతోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్ చేస్తోంది. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా మంచి ప్రదర్శన ఇచ్చారు. ఇద్దరూ ఫోర్లతో పరుగులు రాబట్టారు. శుభ్‌మన్ గిల్ 16 బంతుల్లో 29* పరుగులు రాబట్టాడు. అందులో 6 ఫోర్లు ఉన్నాయి. అలాగే అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23* పరుగులు సాధించాడు. అందులో 1 ఫోర్, 1 సిక్స్ ఉంది. 

మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది అనుకున్న సమయంలో వరుణుడు అడ్డంకిగా మారాడు. సడెన్‌గా వర్షం కురవడంతో మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ప్లేయర్స్ అందరూ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. దీంతో భారత్ స్కోర్ 4.5 ఓవర్లకు 52 పరుగులు చేసింది. 

ఈ మ్యాచ్‌లో భారత జట్టు తన ప్లేయింగ్ 11లో ఒక మార్పు చేసింది. తిలక్ వర్మ స్థానంలో రింకు సింగ్‌కు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఈ టీ20 సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగ్గా అందులో.. భారత్ 2 విజయాలు, ఆసీస్ ఒక్క విజయం సాధించింది. మరొకటి వర్షం పడటంతో ఆగిపోయింది. మరి ఇవాళ్టి మ్యాచ్ జరుగుతుందా?.. లేక వర్షం కారణంగా ఆగిపోతుందా? చూడాలి.

Advertisment
తాజా కథనాలు