భారత్ - ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఐదు టెస్ట్‌లో సిరీస్‌లో 1-1తో సమం చేసింది. తొలి టెస్ట్‌లో అద్భుతమైన ఆటతీరుతో గెలుపొందిన భారత జట్టు.. రెండో డే-నైట్ టెస్ట్‌లో అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ విఫలం అయింది. Australia win the second Test and level the series.#TeamIndia aim to bounce back in the third Test.Scoreboard ▶️ https://t.co/upjirQCmiV#AUSvIND pic.twitter.com/Tc8IYLwpan — BCCI (@BCCI) December 8, 2024 తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆసీస్ 336 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 175 పరుగులే చేయగలిగింది. కేవలం 19 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ వికెట్స్ ఏమీ నష్టపోకుండా 3.2 ఓవర్లలోనే విజయం సాధించింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (9), నాథన్ మెక్‌స్వీనీ (10) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లో జరగనుంది.