India Kabaddi Captain: పాకిస్తాన్ కు మరోసారి అవమానం.. షేక్ హ్యాండ్ ఇవ్వని భారత కబడ్డీ కెప్టెన్ (వీడియో)

3వ ఆసియన్ యూత్ కబడ్డీ గేమ్స్‌లో భారత కెప్టెన్ ఇషాంత్ రాఠీ టాస్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్‌తో హ్యాండ్‌షేక్ చేయడానికి నిరాకరించాడు. ఈ సంఘటన భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తోంది. దీని వీడియో వైరల్ అవుతోంది.

New Update
india kabaddi captain ishant rathee no handshake to pakistan captain for asia games 2025

india kabaddi captain ishant rathee no handshake to pakistan captain for asia games 2025

ఆసియా యూత్ గేమ్స్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య కబడ్డీ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో భారత కెప్టెన్ పాకిస్తాన్ అహంకారాన్ని ధిక్కరించి ప్రపంచవ్యాప్తంగా వారిని మరోసారి అవమానించాడు. పాకిస్తాన్ కెప్టెన్‌తో షేక్ హ్యాండ్ చేయడానికి అతను నిరాకరించాడు. టాస్ సమయంలో అతన్ని పూర్తిగా పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

India Kabaddi Captain

నో హ్యాండ్‌షేక్ వివాదం 2025 ఆసియా కప్ నుండి చాలా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ క్రీడాకారులతో హ్యాండ్ షేక్ చేయడానికి టీమ్ ఇండియా నిరాకరించింది. మహిళల ప్రపంచ కప్‌లో కూడా ఇది కొనసాగింది. ఇప్పుడు పాకిస్తాన్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా అవమానానికి గురైంది. భారత యువ కబడ్డీ జట్టు కెప్టెన్ పాకిస్తాన్‌ కెప్టెన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించాడు. అదే సమయంలో అతన్ని అస్సలు పట్టించుకోలేదు. 

మూడవ ఆసియా యూత్ గేమ్స్‌లో భారత జట్టు కబడ్డీలో పాకిస్థాన్‌ను ఎదుర్కొంది. మ్యాచ్‌కు ముందు టాస్ జరిగింది. అక్కడకి రెండు జట్ల కెప్టెన్లు వచ్చారు. టాస్ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ కరచాలనం కోసం చేయి చాచాడు. కానీ భారత కెప్టెన్ ఇషాంత్ రఠి అతన్ని పూర్తిగా పట్టించుకోలేదు. టాస్, ఫోటోషూట్ తర్వాత ఇషాంత్ రిఫరీతో కరచాలనం చేసి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆసియా యూత్ గేమ్స్‌లో భారత కబడ్డీ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. భారత్ మొదట బంగ్లాదేశ్, ఇరాన్, శ్రీలంకలను ఏకపక్ష మ్యాచ్‌లలో ఓడించారు. ఇప్పుడు పాకిస్తాన్‌కు ఘోర పరాజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 81-26 ఆధిక్యంతో గెలిచింది. మూడవ ఆసియా యూత్ గేమ్స్‌లో టీమ్ ఇండియా ఆధిపత్యం కొనసాగింది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా భారత యువ కబడ్డీ జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అని నిరూపించుకుంది.

Advertisment
తాజా కథనాలు