బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 295 పరుగుల తేడాతో ఆసీస్ ఓటమి పాలయ్యింది. 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 238 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఐదు టెస్టుల బీజీటీలో భారత్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరగనుంది.
వాస్తవానికి పెర్త్ వేదికగా జరిగే మ్యాచుల్లో 534 పరుగుల లక్ష్య చేధన అనేది అసాధ్యం. ఈ మ్యాచ్‌లో డ్రా అయ్యేవరకైన ఆసిస్ పోరాడుతుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ భారత బౌలర్ల ముందు ఆస్ట్రేలియా బౌలర్లు తేలిపోయారు. ఓపెనర్లు నాథన్ మెక్‌స్వీనీ (0), ఉస్మాన్ ఖవాజా (4) సింగిల్ డిజిట్ స్కోరు చేశారు. ఆ తర్వాత వచ్చిన పాట్ కమిన్స్ (2), మార్కస్ లబుషేన్ (3) చేశారు. వీళ్లు కనీసం డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో ఆసిస్ 17/4 వద్ద ఉండిపోయింది. ఆ తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్ (89), మిచెల్ మార్ష్ (47) చేశారు. ఆరో వికెట్‌తో 82 పరుగుల భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా డ్రా ఆశలు చిగురించాయి. కానీ హెడ్ వికెట్ బుమ్రా తీయగా, మిచెల్ మార్ష్‌ను నితీశ్ రెడ్డి బోల్తా కొట్టించాడు.
ఇక చివర్లో అలెక్స్ క్యారీ (36), మిచెల్ స్టార్క్ (12), నాథన్ లయన్ (0) జోష్ హేజిల్‌వుడ్(4) చేశారు. దీంతో ఆస్ట్రేలియా ఆశలు నిరుగారిపోయాయి. విజయానికి టిమిండియా దగ్గరైంది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ రెండు, నితీశ్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టారు. మొత్తానికి 295 పరుగుల తేడాతో టీమిండియా ఆసిస్‌ను ఓడించింది.