/rtv/media/media_files/2025/06/19/karun-nair-2025-06-19-17-33-36.jpg)
karun-nair
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్ట్ సిరీస్ రేపు (జూన్ 20) లీడ్స్‌లోని హెడింగ్లీలో ప్రారంభమవుతుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది. అయితే తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. హెడింగ్లీలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ గాయపడ్డాడు.
The incident where Karun Nair got hit at the nets by a delivery from @prasidh43@RohanDC98#ENGvsIND#Headingleypic.twitter.com/xGMsiSF8PA
— RevSportz Global (@RevSportzGlobal) June 18, 2025
ప్రసీద్ కృష్ణతో ప్రాక్టీస్ చేస్తున్న టైమ్ లో అతని పక్కటెముకలకు గాయం జరిగినట్లుగా సమాచారం. అయితే అతని గాయం పెద్దది అయితే మాత్రం తుదిజట్టులో ఉండకపోవచ్చు. కాగా కరుణ్ నాయర్ 8 సంవత్సరాల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. 2016 లో ఇంగ్లండ్‌పై అజేయంగా 303 పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించిన రెండవ భారతీయుడిగా కూడా నిలిచాడు. ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్ట్‌లో కూడా 204 పరుగుల డబుల్ సెంచరీతో తన ఫామ్‌ను కొనసాగించాడు.
ప్రస్తుతం నాయర్ కు గట్టి పోటీ ఇస్తున్న సాయి సుదర్శన్ నెట్స్ లో బాగా రాణిస్తున్నాడు. ఈ కారణంగా జట్టులో మూడో స్థానానికి గట్టి పోటీ నెలకొంది. నాయర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోతే సాయి సుదర్శన్ కు అవకాశం ఉండవచ్చు. మరోవైపు తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇప్పటికే ప్రకటించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ టీమ్ .. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు పేస్ ఆల్‌రౌండర్లు, ఒకే ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది.
ఇంగ్లండ్ తుది జట్టు:
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రిడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్