IND Vs SA: భారత్ ఘోర ఓటమి.. తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా విజయం

భారత్, దక్షిణాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగింది. తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమైంది.

New Update
South Africa won the 1st Test

South Africa won the 1st Test

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగింది. తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమైంది. భారత్ కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. 

South Africa won the 1st Test

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో కేవలం 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇందులో ఐడెన్ మార్క్రామ్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా (5/27) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు. 

ఆ తర్వాత భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 65.2 ఓవర్లలో 189 పరుగులు చేసి.. 30 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇందులో కేఎల్ రాహుల్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే సమయంలో దక్షిణాఫ్రికా ఆఫ్-స్పిన్నర్ సైమన్ హార్మర్ (5/63) ఐదు వికెట్లు తీశాడు.

ఇక సెకండ్ ఇన్నింగ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అదరగొట్టేశాడు. 55* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతా వారంతా చేతులెత్తేయడంతో దక్షిణాఫ్రికా 46.3 ఓవర్లలో 153 పరుగులు మాత్రమే చేసింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అదరగొట్టేశాడు. తన అసాధారణ బౌలింగ్‌తో (7/52) సఫారీ జట్టుకు చెమటలు పట్టించాడు. 

దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ ముందు కేవలం (30-153=124) 124 పరుగుల టార్గెట్ మాత్రమే ఉంది. కానీ ఈ టార్గెట్‌ను భారత్ ఛేదించలేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. 36.3 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌటయ్యారు.  

Advertisment
తాజా కథనాలు