IND VS NZ: 48 ఓవర్లు కంప్లీట్.. కివీస్ స్కోర్ ఇదే!

మొదటి ఇన్సింగ్స్ ఆడుతోన్న కివీస్ సతకిళ్ల పడినట్లు తెలుస్తోంది. 48 ఓవర్లు ముగిసే సరికి కేవలం 228 పరుగులు మాత్రమే సాధించింది. క్రీజ్‌లో బ్రేస్ వెల్ (35*), శాంట్కర్ (4*) ఉన్నారు. ప్రస్తుతం కివీస్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 228 సాధించింది.

New Update
ind vs nz 2

ind vs nz

మొదటి ఇన్సింగ్స్ ఆడుతోన్న కివీస్ సతకిళ్ల పడినట్లు తెలుస్తోంది. 48 ఓవర్లు ముగిసే సరికి కేవలం 228 పరుగులు మాత్రమే సాధించింది. క్రీజ్‌లో బ్రేస్ వెల్ (35*), శాంట్కర్ (4*) ఉన్నారు. ప్రస్తుతం కివీస్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 228 సాధించింది. 

లారా రికార్డును సమం

ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ అత్యంత రసవత్తరంగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్‌కు దిగింది. ఈ క్రమంలోనే రోహిత్ అరుదైన రికార్డును సమం చేశాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా టాస్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అతడు వన్డే క్రికెట్‌లో వరుసగా 12వ సారి టాస్‌ను కోల్పోయాడు.

ఈ తరుణంలోనే విండిస్ స్టార్ ప్లేయర్ బ్రయన్ లారా (1998-99) సీజన్‌లో వరుసగా 12 సార్లు టాస్ కోల్పోయిన రికార్డును రోహిత్ సమం చేశాడు. కాగా వన్డే ఫార్మేట్లలో టీమిండియా అదృష్టం వెక్కిరించడం ఇది 15వ సారి కావడం గమనార్హం. అయితే ఇలా టాస్ ఓడిపోవడం 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ప్రారంభమైంది. అప్పుడు అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా vs భారత్ మధ్య పోరుతో ఈ పరంపర స్టార్ట్ అయింది.

అప్పటి నుంచి భారత్ వరుసగా టాస్ ఓడిపోతూ వస్తోంది. దీంతో ఈ లిస్ట్‌లో మొదటిగా లారా ఉండగా.. ఇప్పుడు అతడితో పాటే రోహిత్ చేరాడు. వీరిద్దరూ ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నారు. ఇదే జాబితాలో తర్వాతి వరుసలో నెదర్లాండ్స్ ప్లేయర్ పీటర్ బారెన్ ఉన్నాడు. అతడు వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు