/rtv/media/media_files/2025/03/09/Lg67GMP50yJPXvhyIpi7.jpg)
Daryl Mitchell
న్యూజిలాండ్ మెల్లి మెల్లిగా స్కోర్ రాబడుతోంది. తాజాగా కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ చేశాడు. 91 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో కివీస్ 42 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో మిచెల్ (50*), బ్రేస్‌వెల్ (11*) ఉన్నారు. మరోవైపు భారత్ బౌలర్లు అదరగొడుతున్నారు. వరుస వికెట్లు పడగొడుతూ రెచ్చిపోతున్నారు. కుల్దీప్, వరుణ్, షమీ, జడేజా అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. స్కోర్ కట్టడి చేస్తూ కివీస్ బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నారు.