రెండో టెస్ట్‌లో భారత్‌కు షాక్.. చెలరేగిన కివీస్ జట్టు! పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో కివీస్ జట్టు 259 పరుగులకు అలౌట్ అయ్యింది. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్ మొదలవ్వగా.. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. మొదటి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 16/1 ఉంది. By Kusuma 24 Oct 2024 in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి భారత్, న్యూజిలాండ్ మధ్య పూణే వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ ఆరంభంలోనే భారత్‌కు పెద్ద షాక్ తగిలింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ కేవలం 16/1 స్కోర్‌తో మాత్రమే ఉంది. న్యూజిలాండ్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది కూడా చూడండి: కొత్తగా పెళ్లయ్యిందా.. ఈ మూడు పాటించాల్సిందే! మొదటి మ్యాచ్‌లోనే.. మొత్తం 259 పరుగులకు కివీస్ జట్టు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత భారత్ మ్యాచ్ ప్రారంభమైన మొదట్లోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక రన్ కూడా వేయకుండానే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వెళ్లిన శుభమన్ గిల్(10*), యశస్వి జైస్వాల్(6*) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌తో పోలిస్తే భారత్ ఇంకా 243 పరుగులు వెనుకలో ఉంది. ఇది కూడా చూడండి: పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి? కివీస బ్యాటింగ్ సమయంలో వాషింగ్టన్ సుందర్ ఎక్కువగా 7 వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. మెదట బ్యాటింగ్ చేసిన డేవాన్ కాన్వే ఎక్కువగా 76 పరుగులు చేశాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర(65), మిచెల్ సాంథ్నర్(33) పరుగులు చేయగా.. మిగతా వారు కేవలం 20 పరగులు వరకు మాత్రమే చేశారు. ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన! ఇదిలా ఉండగా మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ మొదటి మ్యాచ్‌లో విజయం సాధించింది. బెంగళూరు చిన్నస్వామి వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో కివీస్ జట్టు విజయం సాధించింది. భారత్‌పై న్యూజిలాండ్ టీమ్ 1988లో ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో చివరిగా గెలవగా మళ్లీ ఇప్పుడు గెలిచింది. ఇది కూడా చూడండి: అమరావతికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు! #ind-vs-nz మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి