/rtv/media/media_files/2026/03/05/ind-vs-eng-2026-03-05-14-57-22.jpg)
ఇవాళ భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రసవత్తరమైన సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ఇరు జట్లు ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటి వరకు వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడగా.. చెరో మ్యాచ్ గెలిచాయి. అందులో సెమీస్‌లో గెలిచిన జట్లే ఫైనల్‌లోనూ గెలుపొందడం విశేషం.
ind vs eng semi final 2026
ఇదిలా ఉంటే ఈ టోర్నీలో భారత్ మొదటి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో సెమీస్ వరకు దూసుకొచ్చింది. ప్రతి మ్యాచ్‌లోనూ ఎవరో ఒకరు ఆడుతుండటంతో ఇక్కడ వరకు చేరుకున్నారు. ఇక ఈ కీలకపోరులో అయినా జట్టు సమిష్టిగా రాణిస్తే ఫైనల్‌కు చేరడం ఖాయమని పలువురు భావిస్తు్న్నారు. మరోవైపు ఇంగ్లాండ్ సైతం గ్రూప్ దశలో తడబడినా సూపర్ 8లోకి స్థానం దక్కించుకుంది. ఈ సూపర్8లో అదరగొట్టి సెమీస్‌లో అడుగుపెట్టింది.
రెండు జట్లు బలంగా ఉండటంతో ఈ పోరు అత్యంత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. ఈ T20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ టాస్ సాయంత్రం 6:30 గంటలకు జరుగుతుంది. మ్యాచ్ 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ సెమీ-ఫైనల్ మ్యాచ్ భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతుంది. అలాగే ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో చూడవచ్చు. అంతేకాకుండా మీరు డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లో కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించవచ్చు.
💬 💬 𝘼𝙩 𝙒𝙖𝙣𝙠𝙝𝙚𝙙𝙚 𝙎𝙩𝙖𝙙𝙞𝙪𝙢, 𝙤𝙪𝙧 𝙚𝙣𝙚𝙧𝙜𝙞𝙚𝙨 𝙬𝙞𝙡𝙡 𝙗𝙚 𝙊𝙉𝙀.#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #ENGvINDhttps://t.co/6KU10oBtEb
— BCCI (@BCCI) March 5, 2026
IND vs ENG జట్లు
భారత జట్టు: అభిషేక్ శర్మ , సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాడ్ స్క్వాడ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), బ్రూక్ (కెప్టెన్), బెతెల్, బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, ఒవర్టన్, డాసన్, ఆర్చర్, అడిల్ రషీద్.
Follow Us