Ben Stokes: చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. సెంచరీతో రికార్డుల వర్షం

భారత్‌తో నాలుగో టెస్టులో బెన్ స్టోక్స్ అద్భుత ప్రదర్శనతో రికార్డులు సృష్టించాడు.కెప్టెన్‌గా స్టోక్స్ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసి 5 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ తొలి ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్ క్రికెట్‌లో 7వేల పరుగులు, 200+ వికెట్లు తీసిన 3వ ఆటగాడిగా నిలిచాడు.

New Update
ben stokes did a great feat by scoring a  brilliant century made 5 big records in his name

Ben Stokes' records in the fourth Test match against India

IND vs ENG: భారత్ VS ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సీరీస్‌లో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు జరిగాయి. అందులో భారత్ ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. మరో రెండు మ్యాచ్‌లను ఇంగ్లాండ్ ఛేజిక్కించుకుంది. ఇప్పుడు నాలుగో మ్యాచ్ జరుగుతోంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న ఈ నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 

లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన స్టోక్స్.. ఇప్పుడు మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో ఓ వైపు బౌలింగ్, మరోవైపు బ్యాటింగ్‌తో దుమ్ము దులిపేశాడు. బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టిన స్టోక్స్.. ఆ తర్వాత బ్యాట్‌తో అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో స్టోక్స్ తన పేరు మీద భారీ రికార్డులను సృష్టించాడు. 

చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్ 

మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. దాదాపు 3 సంవత్సరాల తర్వాత అతడు టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. ఇది మాత్రమే కాకుండా దీనికి ముందు స్టోక్స్ దాదాపు 8 సంవత్సరాల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇప్పుడు ఈ రెండింటిని ఒకే మ్యాచ్‌లో సాధించి రికార్డులు క్రియేట్ చేశాడు. 

ఈ మ్యాచ్‌లో స్టోక్స్ రికార్డులు 

కెప్టెన్‌గా స్టోక్స్ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసి 5 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ తొలి ఆటగాడిగా నిలిచాడు. 

కాగా ప్లేయర్‌గా అతడు నాల్గవవాడు. అతని ముందు ఇయాన్ బోథమ్, గస్ అట్కిన్సన్, టోనీ గ్రెగ్ ఈ ఘనత సాధించారు. 

మరోవైపు కెప్టెన్‌గా అలాంటి ఘనత సాధించిన ఐదవ ఆటగాడిగా నిలిచాడు. అతని ముందు డెన్నిస్ అట్కిన్సన్, గ్యారీ సోబర్స్, ముస్తాక్ మొహమ్మద్, ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన తర్వాత సెంచరీ సాధించారు.

బెన్ స్టోక్స్ తన టెస్ట్ కెరీర్‌లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో 7 వేల పరుగులు, 200+ వికెట్లు తీసిన మూడవ ఆటగాడిగా నిలిచాడు. గతంలో, గ్యారీ సోబర్స్, జాక్వెస్ కాలిస్ మాత్రమే ఈ ఘనతను సాధించారు. 

Advertisment
తాజా కథనాలు