/rtv/media/media_files/2025/11/01/ind-vs-aus-t20-series-2-2025-11-01-19-10-25.jpg)
IND Vs AUS T20 Series
రేపు క్రికెట్ ఫ్యాన్స్ డబుల్ ధమాకాతో ఎంజాయ్ చేయనున్నారు. ఒకవైపు ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. మరోవైపు మెన్స్ టీ20 సిరీస్‌లోని మూడో మ్యాచ్ కొనసాగనుంది. ICC Women's World Cup 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నవీ ముంబైలో జరగనుంది. అలాగే టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య T20 సిరీస్‌లోని మూడో మ్యాచ్ నవంబర్ 2న హోబర్ట్ లోని బెల్లెరివ్ ఓవల్ లో జరగనుంది.
IND Vs AUS T20 Series
అక్టోబర్ 30వ తేదీన రెండో మ్యాచ్ జరగ్గా.. అందులో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి మూడో మ్యాచ్‌లో విజయం సాధించాలని భారత్ పట్టుదలతో ఉంది. మరోవైపు ఆసీస్ ఈ మ్యాచ్‌ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొందరు ఈ మ్యాచ్‌ను ఎక్కడ ఫ్రీగా చూడాలి. ఏ టైం మ్యాచ్ ప్రారంభం అవుతుంది అని తెగ వెతికేస్తు్న్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టీ20 మ్యాచ్ హోబర్ట్‌లో మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 1:15 గంటలకు జరుగుతుంది. అభిమానులు ఈ మ్యాచ్‌ను సబ్‌స్క్రిప్షన్ ద్వారా స్టార్ స్పోర్ట్స్‌లో, డిజిటల్‌గా జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. అదే సమయంలో అభిమానులు డీడీ స్పోర్ట్స్ ద్వారా మ్యాచ్‌ను ఫ్రీగా చూడొచ్చు. అలాగే వెబ్‌సైట్‌లో కూడా ఉచితంగా మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు.
ఇకపోతే గత మ్యాచ్ మెల్‌బోర్న్ T20లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ జట్టు ఘోరంగా విఫలమైంది. జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి బంతితో ఆకట్టుకోగా, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా బ్యాట్‌తో ఆకట్టుకున్నారు. వీరు తప్ప మిగతా వారందరూ నిరాశపరిచారు. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజు సామ్సన్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ వంటి ప్లేయర్లు పేలవమైన ఫామ్ కనబరిచారు. మరి ఈ ప్లేయర్లు నెక్స్ట్ మ్యాచ్‌లో అయినా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తారా? లేదా? అనేది చూడాలి.
ఇరు జట్ల ప్లేయింగ్ 11
భారత్- శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా- మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, సీన్ అబాట్.
Follow Us