IND Vs AUS T20 Series: కష్టాల్లో భారత్.. 50 పరుగులకు 5 వికెట్లు ఢమాల్

భారత్, ఆస్ట్రేలియా మధ్య T20 సిరీస్‌లో భాగంగా ఈరోజు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రెండవ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కష్టాల్లో పడింది.

New Update
IND Vs AUS T20 Series (1)

IND Vs AUS T20 Series

భారత్, ఆస్ట్రేలియా మధ్య T20 సిరీస్‌లో భాగంగా ఈరోజు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రెండవ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కష్టాల్లో పడింది. వరుస వికెట్లు కోల్పోతూ పరుగులు తీయడానికి అష్టకష్టాలు పడుతోంది. కనీసం ఒక్క పరుగు తీయడానికి కూడా భారత్‌కు కష్టంగా మారింది. వార్త రాసే సమయానికి భారత్ 8 ఓవర్లలకు గానూ 5 వికెట్లు కోల్పోయి కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా ఉన్నారు. 

IND Vs AUS T20 Series

ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన శుభ్‌మన్ ‌గిల్ మళ్లీ సెకండ్ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. క్రీజ్‌లో ఎక్కువ సమయం నిలబడలేకపోయాడు. 2.4వ ఓవర్‌లోనే గిల్ ఔట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అప్పటికి భారత్ 20 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత వచ్చిన సంజు సామ్‌సన్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. 

నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో 3.3వ ఓవర్‌లో ఎల్బీతో సంజు (2) వెనుదిరిగాడు. దీంతో 23 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతడు అయినా వికెట్ పడకుండా పరుగులు సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతికి 4.3వ ఓవర్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన సూర్య ఔటయ్యాడు. అతడు కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. 

ఇలా స్వల్ప వ్యవధిలోనే టీమ్‌ఇండియా మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత తిలక్ వర్మ సైతం చేతులెత్తేశాడు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో 4.5వ ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి డకౌటయ్యాడు. దీంతో 5 ఓవర్లకు గానూ భారత్ 4 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. ఇంత మంది వరుసగా క్యూ కడుతున్నా.. అభిషేక్ మాత్రం మెల్లి మెల్లిగా పరుగులు రాబట్టాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చింన అక్షర్ పటేల్ (5) సైతం ఔటై వెనుదిరిగాడు. మొత్తంగా భారత్ 8 ఓవర్లకు 50 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్‌లో అభిషేక్, హర్షిత్ ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు