/rtv/media/media_files/2025/10/31/india-vs-australia-t20-2025-10-31-17-26-29.jpg)
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది. 126 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ కెప్టెన్ మార్ష్ 26 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మూడో మ్యాచ్ నవంబర్ 2వ తేదీన జరుగుతుంది.
Australia takes a 1-0 lead in the five-match T20I series against India, with three games remaining.
— CricTracker (@Cricketracker) October 31, 2025
📸: Jio Hotstar#AUSvsINDpic.twitter.com/Qade1Bsvui
భారత్ బ్యాటర్ల స్కోర్
మొదట టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గిల్, అభిషేక్ ఓపెనర్లుగా వచ్చారు. మొదటి మ్యాచ్‌లో నిరాశ పరిచిన గిల్ ఈ మ్యాచ్‌లో కూడా పెద్దగా రాణించలేకపోయాడు. 10 బంతులు ఆడి చివరికి 5 పరుగులతో వెనుదిరిగాడు. క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సంజు సామ్‌సన్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే వంటి ప్లేయర్లు సైతం పెద్దగా పరుగులు సాధించలేకపోయారు.
వరుసగా వికెట్లు కోల్పోయారు. సంజు సామ్‌సన్ 4 బంతుల్లో 2 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 4 బంతుల్లో ఒక్కపరుగు, తిలక్ వర్మ 2 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ 12 బంతులకు 7 పరుగులు, శివమ్ దూబే 2 బంతుల్లో 4 పరుగులు, కుల్దీప్ యాదవ్ 6 బంతులు ఆడి డకౌట్, వరుణ్, బుమ్రా ఒక్కబంతి ఆడి డకౌట్ అయ్యారు. ఇలా భారత్ ప్లేయర్లందరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయకుండా చేతులెత్తేశారు.
కేవలం ఓపెనర్ అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా మెల్లి మెల్లిగా పరుగులు రాబట్టి భారత్‌కు 100 పరుగులకు పైగా స్కోర్ అందించారు. అభిషేక్ శర్మ 68 పరుగులు, హర్షిత్ రాణా 35 పరుగులు చేశారు. మొత్తంగా భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఆసీస్ బ్యాటర్ల స్కోర్
దీంతో 126 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ 26 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హెడ్ 28 పరుగులు, ఇంగ్లిష్ 20 పరుగులు, టిమ్ డేవిడ్ 1 పరుగు, ఓవెన్ 14 పరుగులు చేయగా.. షార్ట్ డకౌట్ అయ్యాడు.
Follow Us