Hockey player : రోడ్డు ప్రమాదంలో హాకీ క్రీడాకారిణి దుర్మరణం!

లక్నోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. LDA కాలనీలోని LPS స్కూల్‌లో క్రీడా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జూలీ, ఇంటర్-స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను పర్యవేక్షించడానికి వెళ్తూ ఉండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

New Update
luknow

జాతీయ స్థాయి అథ్లెట్,  హాకీ క్రీడాకారిణి 23 ఏళ్ల జూలీ యాదవ్ లక్నోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. LDA కాలనీలోని LPS స్కూల్‌లో క్రీడా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జూలీ, ఇంటర్-స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను పర్యవేక్షించడానికి వెళ్తూ ఉండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

పారా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మౌడా మోడ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. జూలీ పాఠశాలకు ముందుగానే చేరుకుంది, కానీ ఇంట్లో తన మొబైల్ ఫోన్ మర్చిపోగా..  దానిని తిరిగి తెచ్చుకోవడానికి తిరిగి ఇంటికి తన హోండా షైన్ బైకుపై వెళ్లింది. అక్కడినుంచి  తిరిగి వస్తుండగా, గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కు ఆమె బైక్‌ను వేగంతో ఢీకొట్టింది, దీంతో ఆమె తీవ్రగాయలయ్యాయి.  ప్రత్యక్ష సాక్షులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆమెను ట్రామా సెంటర్‌కు తరలించారు, అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు.ఆమ మరణ వార్త కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్ర  దుఃఖంలో మునిగిపోయారు తల్లిదండ్రులు.  

నిబద్ధత కలిగిన క్రీడాకారిణిగా

ఉత్తరప్రదేశ్‌లోని మౌండా గ్రామానికి చెందిన జూలీ యాదవ్, జాతీయ స్థాయిలో హాకీ,  అథ్లెటిక్స్‌లో (400మీ, 800మీ పరుగు పందెం) రాణించి బంగారు పతకాలు సాధించారు. అఖిల భారత మహిళా హాకీ జట్టు తరపున కూడా ఆడారు. ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన క్రీడాకారిణిగా, ఉపాధ్యాయురాలిగా ఆమెకు మంచి పేరుంది. ఆమె హఠాన్మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జూలీ అకాల మరణం లక్నో క్రీడా సమాజంలో ఒక శూన్యతను మిగిల్చిందని చెప్పాలి. 

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని తీసుకుని పారిపోయిన ట్రక్కు డ్రైవర్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు