Rajesh Banik Died: ఘోర రోడ్డు ప్రమాదం.. భారత మాజీ క్రికెటర్ మృతి

క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం చోటుచేసుకుంది. అండర్-19 ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన భారత మాజీ క్రికెటర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడి మరణం క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

New Update
BREAKING

BREAKING

క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం చోటుచేసుకుంది. అండర్-19 ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన 40 ఏళ్ల భారత మాజీ క్రికెటర్ రాజేష్ బానిక్ పశ్చిమ త్రిపురలోని ఆనంద్‌నగర్‌ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతడి మరణం క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Rajesh Banik Died


పశ్చిమ త్రిపురలోని ఆనందనగర్ సమీపంలో శుక్రవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న రాజేష్ బానిక్ ఘోరమైన ప్రమాదానికి గురయ్యారు. అనంతరం తీవ్ర గాయాలపాలైన ఆయన్ను అగర్తలలోని జి.బి. పంత్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే హాస్పిటల్‌కు చేరుకునే లోపే రాజేష్ బానిక్ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. రాజేష్ మరణం క్రికెట్ ప్రపంచంలో విషాదాన్ని నింపింది. కాగా రాజేష్ బానిక్.. భారత మాజీ స్టార్స్ ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు వంటి ప్రముఖ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకున్నారు. 

కాగా రాజేష్ బానిక్.. త్రిపుర క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతులైన ప్లేయర్లలో ఒకరు. ఆయన ఒక ఆల్ రౌండర్. రైట్ హ్యాండ్ బ్యాటర్ అండ్ లెగ్ బ్రేక్ బౌలర్‌గా కూడా రాణించారు. ఆయన తన రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారు. డిసెంబర్ 12, 1984 అగర్తలలో జన్మించిన రాజేష్ బానిక్.. 2002-03 సీజన్‌లో త్రిపుర తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. 

అలాగే అండర్ 19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అతడు చివరిసారిగా 2018లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కూడా అతడు విశ్రాంతి తీసుకోలేదు. అండర్ 16 క్రికెట్ జట్టుకు సెలెక్టర్‌గా పనిచేశారు. ఎంతో మంది యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు.

Advertisment
తాజా కథనాలు