/rtv/media/media_files/2025/02/24/N5JVQHpvZhNJ2GR5AagX.jpg)
Virat Kohli
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య సెమీ ఫైనల్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 264 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటంగ్ జరుగుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఔట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కూడా పెవిలియన్ చేరారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. 88 బంతుల్లో 78 పరుగులు వద్ద ఉన్నాడు. తప్పకుండా సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టీమిండియా స్కోర్ 39 ఓవర్లకు 198/4గా ఉంది. టీమిండియా ఫైనల్స్‌కి వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. 265 పరుగులు చేస్తే ఇండియా జట్టు ఫైనల్స్‌కి వెళ్తుంది. టీమిండియా భారం అంతా కూడా విరాట్ కోహ్లీపైనే ఉంది.
He plays slow
— TukTuk Academy (@TukTuk_Academy) March 4, 2025
He plays for milestones
He plays for this
He plays for that
But he always plays and stays there, and gives his best for the team's victory....King Kohli's bat speaks so loud🙇♂️ pic.twitter.com/2EArCSlm7H