PCB : పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై భారత స్పిన్నర్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎంతోమంది గొప్ప క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించిన పాక్ పరిస్థితి చూస్తే విచారంగా ఉందని చెప్పాడు. కెప్టెన్లను మార్చడం వల్లే పాక్ జట్టులో అయోమయం మొదలైందన్నాడు. ఇకనైనా ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టిసారించి జట్టు విజయాలపై ఫోకస్ చేస్తే బాగుటుందంటూ కీలక సూచనలు చేశాడు.
అత్యంత దారుణంగా తయారైంది..
ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అశ్విన్.. ‘పాక్ క్రికెట్ పరిస్థితిని చూస్తుంటే నిజంగా బాధేస్తోంది. వారి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఎంతోమంది గొప్ప ప్లేయర్లు ప్రాతినిధ్యం వహించారు. గొప్ప విజయాలను నమోదు చేసి ప్రపంచం గర్వపడే టీమ్‌గానూ గుర్తింపు పొందింది. నైపుణ్యమున్న క్రికెటర్లకు కొదవలేదు. ఇప్పటికీ చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు. కానీ బోర్డులో చోటు చేసుకుంటున్న ఘటనల కారణంగా జట్టు ప్రదర్శన దెబ్బతిన్నది. కుర్చీల కోసం పాక్ పరిస్థితి దిగజారుతోంది. బాబర్ అజామ్ రాజీనామా చేయడం తీవ్ర ప్రభావం చూపింది. బంగ్లాతో సొంత గడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయింది. ఇప్పటికైనా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి' అంటూ చెప్పుకొచ్చాడు.