ఒక ఓవర్‌‌లో 5 సిక్స్‌లు, 40 బంతుల్లో సెంచరీ..రెచ్చిపోతున్న సంజూ

భారత క్రికెటర్లు ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో రెచ్చిపోతున్నారు. ఒకరిని మించి ఒకరు బ్యాటింగ్‌తో చితక్కొడుతూ..బంగ్లా బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు.సంజూ అయితే ఏకంగా ఒక ఓవర్‌‌లో 5 సిక్స్‌లు కొట్టడమే కాకుండా..40 బంతుల్లో సెంచరీ కూడా చేశాడు. 

author-image
By Manogna alamuru
New Update
india

Sanju Samson New Record: 

బంగ్లాదేశ్‌తో టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌లు టీ20 సీరీస్ ఆడుతోంది. ఇందులో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సీరీస్‌ను సొంతం చేసుకుంది భారత జట్టు. ఈరోజు మూడు మ్యాచ్ నామ్‌ కే వాస్త్ గా జరుగుతోంది. హైదరాబాద్ లోఇ ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ అవుతోంది. ఇందులో టీమ్ ఇండియా కెప్టెన్  సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన అభిషేక్‌ శర్మ కేవలం నాలుగు పరుగులే చేసి అవుట్ అయ్యాడు. అయితేఇతనితో పాటూ క్రీజ్‌లోకి వచ్చి సూర్య కుమార్‌ యాదవ్‌ 65 పరుగులు చేసి బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆ తరువాత వచ్చిన సంజూ అయితే వాళ్ళ నోట మాట పడిపోయి..కళ్లు అప్పగించేలా స్ట్రోక్స్ ఇచ్చాడు.  రిషద్‌ వేసిన పదో ఓవర్‌లో సంజూ ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఒక్క బంతి తప్ప ఆ ఓవర్‌లో అన్ని బంతులనూ సిక్సర్ల బాట పట్టించాడు. మొత్తం మ్యాచ్ అంతా ఇలానే ఆడుతూ 40 బంతుల్లో సెంచరీ కూడా పూర్తి చేసేశాడు. వీరిద్దరూ ఇదే విజృంభణ కొనసాగితే కొత్త రికార్డులు ఖాయమే. ప్రస్తుతం భారత్‌ 13 ఓవర్లకు 190 పరుగులు చేసింది.

Also Read: AP: రాయలసీమ, కోస్తాంధ్రాలకు భారీ వర్షాలు..

Advertisment
తాజా కథనాలు