IND vs AUS: ఆసిస్ లక్ష్యం 175.. నాలుగో టీ20లో భారత్ గౌరవప్రదమైన స్కోరు

రాయ్ పూర్ లో జరుగుతున్న నాలుగో టీ20లో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు సాధించింది.

New Update
IND vs AUS: ఆసిస్ లక్ష్యం 175.. నాలుగో టీ20లో భారత్ గౌరవప్రదమైన స్కోరు

IND vs AUS: కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరూ విఫలమైనప్పటికీ; రింకూసింగ్, జితేశ్ శర్మతో పాటు ఓపెనర్లు రాణించడంతో రాయ్పూర్ లో జరుగుతున్న నాలుగో టీ20లో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (37; 28బంతుల్లో 6ఫోర్లు, ఒక సిక్సర్), రుతురాజ్ గైక్వాడ్ (32; 28బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్సర్) 50పరుగులతో మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అనంతరం క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(8), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(1) ఇలా వచ్చి అలా వెళ్లడంతో స్కోరు వేగం మందగించింది. మొత్తానికి 13వ ఓవర్ లో భారతజట్టు స్కోరు 100 దాటింది.

తర్వాత క్రీజులోకి వచ్చిన భారత సెన్సేషన్ రింకూసింగ్ బౌండరీలతో పరుగుల వేగం పెంచాడు. మరోసారి సత్తా చాటిన రింకూ (46; 29బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లతో) చివరి ఓవర్లో ఔటయ్యాడు. జితేశ్ శర్మ కూడా క్రీజులో ఉన్నంత సేపూ మెరుపులు మెరిపించాడు. మొత్తం 19 బంతులు ఆడిన జితేశ్ 3 సిక్సర్లతో పాటు ఒక బౌండరీ బాది 35 పరుగులు రాబట్టాడు. రింకూ, జితేశ్ కలిసి ఐదో వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు. అయినప్పటికీ క్రమం తప్పకుండా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో భారత్ ఊహించినంత భారీ స్కోరు సాధించలేకపోయింది. ఆసిస్ బౌలర్లలో బెన్ ద్వార్షిస్ మూడు, తన్వీర్ సంఘా రెండు, బ్రెండార్ఫ్ రెండు, ఆరోన్ హార్డీ ఒక వికెట్ పడగొట్టారు.

ఇది కూడా చదవండి: టీ20 వరల్డ్ కప్ టీమ్ లో కోహ్లీకి ఛాన్స్ లేదా? ఏమి జరుగుతోంది?

4వేల పరుగుల లిస్టులో గైక్వాడ్:
ఈ మ్యాచ్ తో టీ20లో 4వేల పరుగులు సాధించిన ఆటగాల్ల లిస్టులో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చేరాడు. రుతురాజ్ 116 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ జాబితాలో క్రిస్ గేల్ అందరికన్నా ముందున్నాడు.

Advertisment
తాజా కథనాలు