Modi Swearing Ceremony: మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న కార్యక్రమానికి స్పెషల్ గెస్టులు రానున్నారు. నూతన పార్లమెంట్ నిర్మాణంలో భాగస్వాములైన శ్రామికులు, ట్రాన్సజెండర్‌లు, పారిశుద్ధ్య కార్మికులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. అలాగే భారత దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే వివిధ దేశాధినేతలు తమకు ఆహ్వానాలు అందినట్లుగా ప్రకటించారు. కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంత మందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ జాబితాలో పలువురు ట్రాన్స్‌జెండర్లు, కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి పని చేసిన శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ రైళ్లు వంటి కీలక ప్రాజుక్టుల్లో పని చేసిన వారికి అవకాశం కల్పించినట్లు చెప్పారు.
Also Read: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. వేదిక మరోసారి మార్పు..!
‘ప్రధానమంత్రి మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాజకీయాల్లో చాలా మార్పులు చోటుచేసుకొన్నాయి. బలమైన దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరి సహకారాన్ని ఆయన గౌరవిస్తారు. వీఐపీలు, వీవీఐపీలకు మాత్రమే ఆహ్వానాలు పంపే రోజులు పోయాయి. మా పీఎం అట్టడుగు వర్గాల్లో వారిని కూడా వీఐపీలుగానే చూస్తారు’’ అని కూటమి వర్గాలు తెలిపాయి.