హైదరాబాద్ లో ప్రత్యేక విమానాలు రెడీ..రంగంలోకి డీకే తెలంగాణలో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు ప్రారంభించింది. గెలుపు ఖాయం కావడంతో ఆ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. దీని కోసం కర్నాటక నుంచి డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. By Manogna alamuru 03 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే.. గెలుపొందిన అభ్యర్థులను కర్ణాటకకు తరలించనున్నారు. రిసార్టు రాజకీయం కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గెలిచిన వారు ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా హస్తం పార్టీ ముందస్తుగానే ప్లాన్ చేసింది. ప్రస్తుత ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తుండటంతో.. ఆ పార్టీ విజయం సాధిస్తే.. గెలుపొందిన అభ్యర్థులను రాష్ట్రం దాటించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గెలిచిన వారిని గెలిచినట్లు.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్ణాటకకు తరలించేలా ప్లాన్ చేశారు. దీని కోసం డీకే.. నిన్న రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. Also Read:తెలంగాణలో దుమ్ములేపిన కాంగ్రెస్.. గెలుపుకు 12 ముఖ్య కారణాలివే తెలంగాణ కాంగ్రెస్ నేతల కోసం బెంగళూరు ఈగల్ టన్ రిసార్ట్ ను బుక్ చేశారు. మొత్తం రిసార్ట్ను కాంగ్రెస్ ఆధీనంలోకి తీసుకుంది. దీనికి గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది. కర్నాటక ఇంటిలిజెన్స్ ఛీఫ్ కేవీ శరత్ చంద్ర రిసార్టను పర్యవేక్షించాలని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే ఆదేశించారు. ఇక ప్రత్యేక విమానాల ద్వారా ఎమ్మెల్యేలను తరలింపు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానాల్లో వీరిని తరలించనున్నారు. వీటితో పాటూ శంషాబాద్ లో మరో నాలుగు హెలికాఫ్టర్లు కూడా పెట్టారు. ఈ మొత్తం వ్యవహారాన్ని డీకే శివకుమార్ అండ్ టీమ్ హైదరాబాద్ లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా రాహుల్ గాంధీ కూడా చూసుకుంటున్నారు. #congress #telangana-elections-2023 #flights #telangana-election-results #dk-siva-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి