Dharani portal: ధరణి సమస్యలపై కమిటీ సమావేశం ధరణి సమస్యలపై కమిటీ సమావేశమైంది. ధరణి డ్రైవ్ లో పరిష్కరించిన దరఖాస్తులపై చర్చించారు. జూన్ 4 లోగా ధరణి సమస్యలపై పెండింగ్ దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లో క్లియర్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. By V.J Reddy 18 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Dharani Portal: ధరణి సమస్యలపై ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు సచివాలయంలో సమావేశమైంది. ధరణి డ్రైవ్ లో పరిష్కరించిన దరఖాస్తులపై చర్చించారు. జూన్ 4 లోగా ధరణి సమస్యలపై పెండింగ్ దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లో క్లియర్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. ధరణిలో మొత్తం 119 తప్పుల్లో స్పెషల్ డ్రైవ్ తరువాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని కమిటీ గుర్తించింది. కాగా ధరణిలో సమస్యలపై తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ధరణి పోర్టల్ లో ఉన్న సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పనిలో పడింది. ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తోంది. #dharani-portal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి