TSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పురుషులకు ప్రత్యేక బస్సులు?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో తమకు సీట్లు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలోని పురుషులు. తమ కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

TSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పురుషులకు ప్రత్యేక బస్సులు?
New Update

Free Bus Scheme In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలో వచ్చిన తరువాత మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) కింద మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కలిపించిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి మంచి స్పందన లభిస్తుంది. బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సుల్లో రద్దీ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్ స్టాండులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పథకంతో మహిళలు ఆనందంగా ఉన్న పురుషులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కలిపించడం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని.. ప్రయాణించేందుకు సీట్లు కూడా దొరకడం లేదని తమ బాధను చెప్పకనే చెబుతున్నారు.

ALSO READ: BREAKING: భారత్ లో భారీ భూకంపం!

అయితే, బస్సుల్లో పురుషులు బాధను అర్ధం చేసుకున్న ఆర్టీసీ(TSRTC) యాజమాన్యం వారి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో పురుషుల కోసం సీట్లను కేటాయించడం, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పురుషుల కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం వంటి వాటిపై కసరత్తు చేస్తోందట. అదే విధంగా విద్యార్థులు కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లే సమయంలో ఎక్కువ బస్సులను ఆ దారుల్లో నడపాలి ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోందట. ఇదిలా ఉండగా మహిళలకే కాదు కష్టపడుతున్న తమకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని.. ఒకవేళ అది వీలుకాకపోతే కనీసం హాఫ్ టికెట్ తీసుకోవాలని రాష్ట్రంలోని పురుషులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారట. దీనిపై సోషల్ మీడియాలో మిమ్స్ తెగ వైరల్ అయ్యాయి.

ALSO READ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల.. గిడుగు రుద్రరాజు క్లారిటీ!

మహిళలకు సజ్జనార్ కీలక సూచన..

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) కీలక సూచనలు చేశారు. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్స్ ప్రెస్ బస్సు ఎక్కువడం ద్వారా ఆర్టీసీకి నష్ట చేకూరుతుందని.. దాని వల్ల ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు పల్లె వెలుగు బస్సులో వెళ్లాలని కోరారు. అలాగే అధికారిక బస్ స్టాపుల్లో మాత్రమే బస్సు ఆగుతుందని స్పష్టం చేశారు.

#tsrtc #special-buses-for-men #free-bus-scheme #telangana-news #free-bus-for-men #telugu-latest-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe