AP News: స్పీకర్ హోదాలో తొలిసారి విశాఖకి వచ్చిన అయ్యన్నపాత్రుడు

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు విశాఖ చేరుకున్నారు. విశాఖ ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కే.మయూర్ అశోక్, అనకాపల్లి కలెక్టర్ రవిసుభాశ్, డీఐజీ విశాల్ గున్ని పలువురు జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పీకర్ అధికారులతో చర్చించారు.

New Update
AP News: స్పీకర్ హోదాలో తొలిసారి విశాఖకి వచ్చిన అయ్యన్నపాత్రుడు

AP News:స్పీకర్ హోదాలో తొలిసారి విశాఖకి చింతకాయల అయ్యన్నపాత్రుడు వచ్చారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న అయ్యన్నపాత్రుడికి టీడీపీ కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు. అయ్యన్నపాత్రుడి రాగతో భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అక్కడ ఆయనను నగర ప్రముఖులు, అధికారులు, టీడీపీ నాయకులు కలిసి పలు అంశాలపై చర్చించారు. అనతరం అనకాపల్లిలోని నూకాంబికా అమ్మవారిని దర్శించున్నారు.

ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ రామారావు ఆశీస్సులతో అతి చిన్న వయసు 25 సంవత్సరంలోనే టీడీపీ పార్టీలో చేరానని అన్నారు. మంత్రిగా, ఎంపీగా నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఉత్తరాంధ్రకి స్పీకర్ పదవి కీలకమైన పదవి చంద్రబాబు ఇచ్చారు. స్పీకర్ అనేది చాలా గౌరవమైన పదవి, ఆ కుర్చీకి కష్టపడి పనిచేసి మంచి పేరుని తీసుకొస్తానని అయ్యన్నపాత్రుడు చెప్పారు.

 ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ జిల్లాలో లారీ-కంటైనర్ ఢీ.. తండ్రీకొడుకులు స్పాట్‌లోనే మృతి

Advertisment
తాజా కథనాలు